విజ‌న‌రీ అంటే చంద్ర‌బాబే...అహ్లూవాలియా

Publish Date:Jul 27, 2022

Advertisement

మీ అబ్బాయి బాగా చ‌దువుతాడండీ, మ‌హా చురుకు.. అని ప‌క్కింటివాళ్లు వ‌చ్చి చెప్పేవ‌ర‌కూ ఆ కుర్రాడిని ఇంట్లోవాళ్లు అంగీక‌రించారు. ఒకవేళ కాస్తంత అనుమానం ఉన్నా అప్ప‌టికి గాని తేరుకుని అవునుస‌మా.. అంటే కాదు మ‌రీ అనుకుంటారు.  ఉమ్మ‌డి ఆంధ్రా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించీ ఆలోచిస్తే అవును నిజం అనిపిస్తుంది. ఆయ‌న గొప్ప విజ‌న‌రీ అని అహ్లూవాలియా వ‌చ్చి గుర్తు చేస్తేగాని తెలుగువారు తేరుకోలేదు. అధికారానికి దూర‌మైనంత మాత్రాన తెలివితేట‌లు, అభివృద్ధి దృష్టి ఆలోచ‌నలో ఎలాంటి మార్పు రాదు. గ‌తంలో చేసింది బంగార‌మైతే గోడ‌కి కొట్టిన‌ట్టు ఎన్నాళ్ల‌యినా, ఎవ‌ర యినా ప్ర‌శంసించాల్సిందే గ‌దా!

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో దేశంలో ఆర్థిక సంస్కరణలపై కీలక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సివిల్ సర్వెంట్ మాజీ అధికారి, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్య క్షుడు  మాంటెక్ సింగ్  అహ్లువాలియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాంటెక్ సింగ్  మాట్లాడుతూ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి విజనరిని ఈ సందర్బంగా ఆయన  ప్రశంస లతో ముంచెత్తారు. అంతేకాదు.. ఆర్థిక సంస్కరణల అమలులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. అలాగే సైబరాబాద్‌ని సృష్టించి  హైదరాబాద్ అభివృద్ధికి  ఆయన పాటుపడిన తీరు అద్భుతమన్నారు. తన ఆలోచనతో.. ఓ నగరాన్ని రూపాంతరం చెందడం కోసం నాటి  సీఎంగా చంద్ర బాబు చేసిన కృషిని ఆయన కొనియాడారు.

ఇక ఐటీని హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు.. నాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు  తన విజనరితో రూపొందించిన ప్రణాళికలను ఈ సందర్భంగా  దాదాపు గంటన్నర సేపు ఆయనకు చంద్రబాబు వివరిం చారని మాంటెక్‌సింగ్ అహ్లువాలియా తెలియ‌జేశారు. అంతేకాదు.. సైబరాబాద్ పేరిట చంద్రబాబు చేసిన కృషిని అప్పట్లో కొందరు ఎగతాళి కూడా చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై  ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లువాలియా  చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మాంటెక్ సింగ్ కామెం ట్స్‌పై సైతం నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగిందంటే.. అది చంద్రబాబు కృషి వల్లేనని వారు సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేస్తున్నారు.  అంతేకాదు.. చంద్ర బాబు విషయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార జగన్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని సైతం నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా ఎండగడుతున్నారు.  

ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు విజనరీ గురించి తెలంగాణలోని పాలక పక్షం టీఆర్ఎస్ నాయ‌కు లంద‌రికీ  తెలుసునని ఒప్పుకోవ‌డానికి వారికి ఈగో అడ్డు వస్తోందని వారు పేర్కొంటున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన ఏనిమిదేళ్లు పూర్తి అయిందని.. ఈ కాలంలో హైదరా బాద్ రూపు రేఖలు ఏమైనా మారాయా? అంటే అదీ లేదని.. నాటి ట్రాఫ్రిక్ సమస్య నేటికి అలాగే ఉందని.. ఇంకా పెరిగిందని ఈ ఒక్క ఉదాహరణ చాలని వారు  సోషల్ మీడియా సాక్షిగా పేర్కొంటున్నారు. ఇక సంక్షేమ పథకాలు అయితే.. పాత సీసాలో కొత్త సారా తయారీ విధి విధానం ఎలాగూ ఉండనే  ఉందని వారు చెబుతున్నారు.  

ఇక ఆంధ్రపద్రశ్‌ విషయానికి వస్తే మాత్రం.. అక్కడ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఓ విధమైన కంపరమని  నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. ఫ్యాన్ పార్టీ  అధి కారంలోకి ఇలా వచ్చిందో లేదో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేసిందని.. అక్కడితో ఆగకుండా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న దాదాపు  అన్ని నిర్ణయాలను తుంగలోకి తొక్కి తన పసితనాన్ని సైతం సీఎం జగన్ చూపించారనే ఓ చర్చ అయితే నేటికి అమరావతి పరిసర ప్రాంత ప్రజల్లో జోరుగా సాగుతోంది.  వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన  తర్వాత  ఇదే చేశారని.. చంద్రబాబు నాయుడి విజనరికి ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

By
en-us Political News

  
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.