బాబు, కిరణ్ కు సవాల్ గా మారిన తిరుపతి ఎన్నికలు
Publish Date:Jun 7, 2012
Advertisement
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారే. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని వీరిద్దరూ పట్టుదలగా ఉన్నారు. స్ పట్టున్న ప్రాంతాల్లో వీరు ఎక్కువగా తిరుగుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతి పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తితో సహా పలువురు నేతలు ప్రచారం చేసేశారు. కొన్ని సంఘాల పేరిట ముద్రించిన కరపత్రాలను తమ ప్రచారంలో భాగంగా పంచిపెట్టారు. వీరి ప్రచారశైలిని గమనించిన తన తరుపున ప్రచారం చేసేవారికి ఒక గ్రూపుగానూ, తాను ఒక గ్రూపుగానూ చీలిపోయి ప్రచారం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వెంకటరమణ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రచారం చేసిన 15 నిమిషాల తరువాత కాంగ్రెస్ ప్రచారం అదే ప్రాంతంలో జరిగేలా ఆయన ఏర్పాటు చేశారు. అంటే టిడిపిపై ఒక గ్రూపు కన్నేసి అనుసరించేలా వెంకటరమణ ఏర్పాట్లు చేయటం నేతలనూ ఇంకేమీ చేయొచ్చో అన్న ఆలోచనలకు పురిగొల్పింది. దీంతో సిఎం ఢిల్లీ నుంచి ఏ నేత వచ్చినా వదలకుండా ముందు తిరుపతి తీసుకువచ్చేస్తున్నారు. వాయలార్ రవి తరువాత గులాంనబీఆజాద్ కూడా రాగానే మొదట ఈ నియోజకవర్గం నుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రముఖ నేతలతో పాటు తిరుగుతూనే వెంకటరమణ తనకు సహాయం చేస్తామన్న నేతలనూ మధ్యమధ్యలో పలకరిస్తున్నారు. ఇటు ఓటు అభ్యర్థిస్తూనే అటు సెల్ లో వారి సహకారం ఏ రూపంలో అందుతోందో కనుగొంటున్నారు. మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి రఘువీరారెడ్డిలతో పాటు ఇప్పటిదాకా అలిగిన గల్లా అరుణకుమారి తదితరులను కలుపుకోవటంలో వెంకటరమణ విజయం సాధించారు. ఐక్యతతో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తరువాత వ్యూహం ఎవరకీ అర్థం కాకుండా సిఎం తీసుకున్న జాగ్రత్తలను అనుసరిస్తూనే అభ్యర్థి వెంకటరమణ ఇతర పార్టీల వ్యూహాలను కిరణ్ కు తెలియజేస్తున్నారు. తాజా సమాచారాలు అందటంతో సిఎం కూడా ఎప్పటికప్పుడు తాము చేసే కార్యక్రమాలను ఎలా మార్చుకోవాలో వెంకటరమణకు సూచనలు ఇస్తున్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ శంకరరెడ్డి ఓటుబ్యాంకుపై, టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఓటుబ్యాంకు పై దృష్టి సారించిన సిఎం తన సోదరుడి ద్వారా వీరిద్దరి కార్యక్రమాలను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కడప ఎన్నికల ప్రచారానికి వెళ్లాలనుకున్నప్పుడల్లా టిడిపి అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో ఆగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ ఉత్సాహాన్ని ఎలా దెబ్బతీయాలో తమ కార్యకర్తలకు సూచిస్తూనే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జా గోపాలకృష్ణలు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు బాబు నిర్దేశిస్తున్నారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్ తదితరులు చేసిన ప్రచారం వల్ల ఉండే ప్రయోజనాలను సమీక్షిస్తూనే అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని కొత్తతరహాలో ఆలోచనలు చేయమని బాబు ప్రోత్సహిస్తున్నారట. ఇలా వ్యూహప్రతివ్యూహల్లో ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ లో ఐక్యతను చెదరగొట్టేందుకు తెలుగుదేశం వేసిన ఎత్తుగడలు ఇప్పటిదాకా ఫలించలేదు. కానీ, బాబు రాజకీయ అనుభవంతో చేసే ప్రతీ పని ఫలితమిస్తుందని, ఎన్నికలు దగ్గరయ్యేటప్పటికి వాతావరణం తమకు అనుకూలమవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/chandra-babu-tdp-20-14682.html
సామాన్యుడైనా..ప్రముఖుడైనా ఎవరికైనా అమ్మ అమ్మే. మదర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ అమ్మకు పాదాభివందనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ
జడ్జీలు డబ్బులు తీసుకుని తీర్పులు ఇస్తున్నారంటూ న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై అటు సుప్రీంకోర్టులోను, ఇటు హైకోర్టులోను కోర్టు ధిక్కర
ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికలు, మరోవైపు 2012 ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయభేరి రాష్ట్రంలో చర్నోపచర్చలకు దారితీశాయి. రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఈ తరుణంలో ఎం.ఐ.ఎం. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెంచల్ గూడ జైలుకు వెళ్ళి
కేరళ :శబరిమల యాత్ర చివరి రోజున పొన్నాంబళంమేడు కొండల్లో అయ్యప్పస్వామి ౩ సార్లు మకర జ్యోతి రూపంలోదర్శనంతో భక్తులు పులకించిపొయారు.జ్యోతి దర్శనానికి అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లుచేశారు.పోలీసులు,వైద్యశాఖ, ఆగ్నిమాపక విభాగం పులిమేడులో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. పంచలిమేడు,పరుంతుపరల నుంచి కూడా మకర జ్యోతిని స్పష్టంగా చూడగలిగారు.
NTR Shakti has 18 Previews – Truly a new Tollywood record – Indeed, for the first time in the history of Telugu cinema, NTR Shakti. Whether you call it a paid preview or a benefit show or NTR Shakti is coming out all guns blazing with a record of 18 previews in Mumbai, Chennai, Pune, etc





