కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడిపోయింది..
Publish Date:Feb 18, 2021
Advertisement
కుప్పంలో వైసీపీ గెలవలేదని.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు చంద్రబాబు. వైసీపీ నాయకులూ చరిత్ర హీనులని అన్నారు. వాలంటీర్లు, అధికారులు అడుగడుగునా బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారనే మాట ఏపీలో అబద్దం అయిందని అన్నారు ఏకగ్రీవాలను ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.. అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్లతో బెదరింపులకు దిగుతున్నారని. ఎన్నికల పోటీలో ఉంటే సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటున్నారని, వాలంటీర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తున్నారని, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ ఎన్నికల సంఘం, కోర్టు చెప్పినట్లు కౌంటింగ్‌ను ఎందుకు రికార్డ్ చెయ్యలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కౌంటింగ్ హాల్‌లో పోలీసులకు ఏం పని అని నిలదీశారు. డబుల్ డిజిట్ ఓట్ల మెజారిటీతో గెలిచిన చోటా రీకౌంటింగ్ ఎందుకు చేశారన్నారు. రాత్రి 10 గంటల తరువాత గెలుపు మార్చేశారని ఆయన ఆరోపించారు. కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటే అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులు...దాన్ని కలుషితం చేస్తారా..? అని ప్రశ్నించారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన ఏజెన్సీలో ఎక్కువ చోట్ల టీడీపీ గెలిచిందన్నారు. వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తనతో మైండ్ గేమ్ ఆడలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిందని. టీడీపీ గళం ఎత్తడం వల్లనే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారని, మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39, మూడో విడతలో 40 శాతం స్థానాలు టీడీపీ గెలుచుకుందన్నారు. మూడు విడతల్లో పోలింగ్ జరిగిన చోట్ల 38-40 శాతం గెలుచుకున్నామన్నారు. పులివెందుల, పుంగనూరు, మాచర్లలో వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
http://www.teluguone.com/news/content/chandra-babu-naidu-fair-on-kuppam-panchayat-election-results-39-110290.html





