విధ్వంసపు పాలనతో ఏపీకి నష్టం.. ప్రజలు గమనించాలన్న చంద్రబాబు

Publish Date:Jan 4, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ సాగుతున్న విధ్వంసపు పాలనతో ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు .రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రతిఒక్కరూ ఆలోచించాలని...  జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని సూచించారు. వైసీపీ పాలనే విధ్వంసంతో  మొదలైందని, ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. రాజధాని కోసం 50 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారని... రాజధానిలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్‌ ఉండేదా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి జగన్ మాట తప్పారన్నారు చంద్రబాబు. కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరమని తెలిపారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు.  పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి  చేయడం జగన్ ప్రభుత్వానికి చేతనవుతుందా? అని నిలదీశారు. 

పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా?’’ అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదన్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసినట్లు తెలిపారు. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు .

By
en-us Political News

  
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది.
రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.