పెద్దల సభకు లెక్కల మాస్టారు భాష్యం రామకృష్ణ

Publish Date:Jun 7, 2026

Advertisement

 

భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎనికపాడు ఆయన స్వగ్రమాం. సామాన్య రైతు కుటుంబంలో భాష్యం రామారావు, పేరమ్మ దంపతులకు 1969 మార్చి 1న రామకృష్ణ జన్మించారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి గుంటూరులోని ప్రైవేటు స్కూలులో లెక్కల మాస్టారిగా కెరీర్ ప్రారంభించిన ఆయన  1983 గుంటూరులోనే భాష్యం విద్యాసంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. 

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోని వందకుపైగా  భాష్యం విద్యా సంస్థలు లక్షలాది మందికి విద్యార్థులకు బోధన అందిస్తున్నాయి. పాఠశాల విద్యలో ప్రత్యేకమైన ముద్ర వేసిన భాష్యం రామకృష్ణ ముందు నుంచీ టీడీపీ సానుభూతిపరులు.  ఆయన 2024లో గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. ఓ దశలో ఏలూరు లోక్‌సభ స్థానం ఇచ్చినా పోటీకి సిద్ధపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్‌ ఇవ్వలేకపోయారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తామని అప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే అవకాశమిచ్చారు.

2019, 2024 ఎన్నికల్లో రామకృష్ణ టీడీపీ తరపున పోటీలో ఉంటారని ప్రచారం జరిగినా రకరకాల సమీకరణలతో అది కర్యరూపం దాల్చలేదు. అయినా పార్టీకి అండగా ఉంటూ పలు కార్యక్రమాలో భాగస్వాములవుతూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కేరళంలకు కూడా విరాళాలు అందించి బాధితులకు అండగా నిలిచారు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవలందించిన రామకృష్ణకు ఇప్పుడు టీడీపీ అధినేత సముచిత ప్రాధాన్యతనిచ్చారు. 

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అంటే భాష్యం రామకృష్ణకు అపారమైన అభిమానం. చంద్రబాబు తన విద్యా సేవల్ని గుర్తించి 2014 నుంచే రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవలో విస్తృత పాత్ర పోషించాలని ప్రోత్సహించారని రామకృష్ణ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తనపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానంటున్నారు. మొత్తానికి ఒక లెక్కల మాస్టారి అంకితభావం, పట్టుదల ఆయన్ని పెద్దల సభకు పంపిస్తోంది


 

By
en-us Political News

  
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.