కేసీఆర్ కు కేంద్ర మంత్రి దిమ్మతిరిగే కౌంటర్.. 

Publish Date:Nov 11, 2021

Advertisement

వరసగా రెండు రోజులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా ఏకి పారేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వమో, ఎంత చేతకాని సర్కారో చక్కగా ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని తేల్చి పారేశారు. అంతే కాదు, తమంతటి నీతి వంతుడు, నిజాయతీపరుడు ఇంకెవరూ లేరని, నిటారుగా నిలబడ్డామని, సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చి, పుచ్చుకున్నారు. ఏ విచారణ చేస్తారో చేసుకోవాలని కేంద్రానికి సవాలు విసిరారు. అంతలోనే కేంద్ర ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అదే సమయంలో తమ ఫార్మర్ హౌస్, రైతు భవంతి వైపు కన్నెత్తి చూస్తే  ఆరు ముక్కలుగా నరుకుతానని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్’ని, సంస్కార వంతమైన భాషలో హెచ్చరించారు.  

అంతేకాదు ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇక రోజూ కేంద్ర ప్రభుత్వ బండారాన్ని బయట పెడతానని అన్నారు. జర్నలిస్టులకు ఇక రోజు ప్రగతి భవన్’లోనే లంచ్  ఉంటుందని నోరూరించే ప్రామిస్ కూడా చేశారు. అయితే, కారణం ఏమిటో కానీ, మూడో రోజు ... నుంచి ప్రగతి భవన్ ఉలుకు పలుకు లేకుండా మూగబోయింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులు వినిపించిన, ‘పచ్చినిజాలు’ ఒకటొకటిగా పచ్చి అబద్ధాలుగా తెలిపోతున్నాయని, సోషల్ మీడియా కోడై కూస్తోంది. అప్పుడు ఇప్పుడు అంటూ పరువు తీస్తోంది. ఈ నిజాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించడం వల్లనే ముఖ్యమంత్రి, డైలీ సీరియల్’ కి బ్రేక్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. 
 రాష్ట్రం విడిపోయి, ఏడు సంవత్సరాలు అయినా, ఇతవరకు కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణకు,కొంచెం ఆలస్యంగానే అయినా కేంద్ర జలవనరుల శాఖ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమాధానం ఇచ్చారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణ, కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణ రెంటినీ పరిశీలిస్తే, ఇద్దరు చెప్పిందీ ఒకటే. వడ్ల గింజలో బియ్యపు గింజ ఇద్దరి మాటల్లో పెద్దగా తేడాలేదు. అయితే, కేసీఆర్ వడ్ల గింజ చూపితే, షెకావత్ పొట్టుతీసి బియ్యపు గింజను బయట పెట్టారు.  

2014జూన్ రెండవ తేదీన రాష్ట్ర విభజన జరిగింది.ఆ తర్వాత కొద్ది నెలలకే,2015లోనే తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నెలరోజుల క్రితం వరకు కేసు’ సుప్రీం కోర్టు విచారణ పరిధిలో ఉంది. ఇది సుప్రీం కోర్టు సాక్షిగా ఎవరూ కాదనలేని నిజం.అయినా, ముఖ్యమంత్రి, ఏడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నీరు అవసరం లేదా? న్యాయం చేయరా? తెలంగాణ భూములను కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఎండ పెట్టాలనుకుంటోందని, సెంటిమెంట్’ను రంగరించి ఆరోపించారు.   

ముఖ్యమంత్రి ఆరోపణపై స్పందించిన కేంద్ర మంత్రి షెకావత్, అదే స్థాయిలో కేసీఆర్’కు  కౌంటర్ ఇచ్చారు. కొత్త ట్రైబ్యునల్‌  ఏర్పాటుపై,  మీరే సుప్రీం కోర్టును ఆశ్రయించారనే విషయాన్ని కేసీఆర్’కు గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యం జరగడానికి, ఇది కాదా కారణమని నిలదీశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, అనే విషయం రాష్ట్రాన్ని పాలిస్తున్న మీకు తెలియదా, అంటూ చురకలు అంటించారు. అంతే కాదు, రెండ్రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని మాటిచ్చిన  కేసీఆర్‌ ప్రభుత్వానికి  సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8నెలలు ఎందుకు పట్టిందని, ఈ జాప్యానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. నెల రోజుల క్రితం పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని వివరించారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు  ఏడేళ్లు ఆలస్యం కావడానికి నేను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తాం’ అంటూ కేంద్ర మంత్రి బంతిని, కేసీఆర్ కోర్టులోకి నెట్టారు.  
పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, నెలరోజుల క్రితం వరకు ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కోర్టు పరిధిలో ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే, కోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం, కేసు ఉప సంహరించుకోమని కేంద్రం సూచించిన తర్వాత ఎనిమిది నెలలు ఏ నిర్ణయం తీసుకోకుండా నానబెట్టింది, కేసీఆర్ ప్రభుత్వం,ఇందులో ఎవరికీ ఎలాంటి రెండో అభిప్రాయం లేదు. ఇక ఇప్పుడు ఎవరు చెప్పింది పచ్చి అబద్ధం.. ఎవరి మాటలు పచ్చి నిజాలు అనేది ..ఎవరికి వారు తేల్చుకోవలసిందే ... అంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.