తప్పులెన్నడమే కాదు.. కేంద్రం తన తప్పులూ గుర్తించాలి!

Publish Date:Jul 21, 2022

Advertisement

కేంద్రం తన అధికార పరిధిని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కుదించుకుని మరీ రాష్ట్రాలు నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ ఇష్టారీతిన అప్పులు చేయడానికి అనుమతులు ఇచ్చేసింది. అందుకు చక్కటి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఇక తెలంగాణ కూడా ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని అతిక్రమించి పరిమితికి మించి అప్పులు చేసింది.

అది కూడా కేంద్రం చలవే.  ఎందుకంటే రాష్ట్రాల అప్పులను నియంత్రించాల్సింది కేంద్రమే. ఆ బాధ్యతను గాలికొదిలేసి రాష్ట్రాలు యథేచ్ఛగా.. వచ్చే ఎన్నికలలో విజయం వ్యూహింగా ఉచిత పథకాల కోసం అభివృద్ధిని, ఉత్పాదకతను కూడా ఫణంగా పెట్టి అప్పులు చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చున్నకేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చినట్లు ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేసి రాష్ట్రాల అప్పులపై హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదం. నిజమే శ్రీలంక పరిస్థితులు ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించేవిగానే ఉన్నాయి. అధికారంలో ఉండటమే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వాలు సంక్షేమం అంటూ ప్రజలకు పని చేయాల్సిన అవసరం లేదు..

మీ అవసరాలన్నీమేమే తీరుస్తాం అంటూ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తుంటే ఏం జరుగుతుందో శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేశాయి. తెలగు రాష్ట్రాల అడ్డగోలు అప్పుల వెనుక కేంద్రం బాధ్యత కాదు కాదు కేంద్రం తప్పు కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్ల రాష్ట్రపతి ఎన్నికలో అవసరం కనుక ఏపీ కోరడమే ఆలస్యం అప్పులకు అనుమతులిచ్చేసిన కేంద్రం.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి కొంత ఇబ్బందులు పెట్టినా.. ఆ రాష్ట్రంలో అధికారంపై కన్నేసింది కనుక చివరికి మేం అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తున్నాం అని చెప్పుకోవడానికి అభ్యంతరాలు చెబుతూనే అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తప్పులన్నీ అటకమీద దాచేసి ఇప్పుడు ఓ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలకు అప్పుల మీద క్లాస్ తీసుకోవడం ఏ విధంగా చూసినా సబబు కాదు.

ముందు అద్దంలో చూసుకున్న తరువాతే ఎదుటి వారి అందంపై కామెంట్లు చేయాలి. కేంద్రానికి మాత్రం ఆ అలవాటు లేదు. తప్పులెన్ను వారు  తమ తప్పులెరుగరన్నట్లు ఎంత సేపూ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల తప్పులెన్నడంతోనే మోడీ సర్కార్ కు కాలం గడిచిపోతోంది. తెలుగు రాష్ట్రాల పరిమితి లేని అప్పులతో భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నా చూస్తూ కూర్చున్న మోడీ సర్కార్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పబ్బం గడిచిన తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రాలపై నెపం నెట్టేయడానికి చూడటం దారుణమని వివిధ రాష్ట్రాల కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. రాష్ట్రాల అప్పులపై అఖిల పక్షంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు ముందే మోడీ రాష్ట్రాల ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు.  

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో మోడీ సర్కార్ కళ్లు మూసుకుందా? స్వయంగా కేంద్రం ప్రకటించిన ఉచితాల సంగతి మాట్లాడకుండా.. ఇప్పుడు పరిస్థితి విషమించడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడం, జనంలో అసహనం పెరుగుతున్న చ్ఛాయలు కనిపించడంతో మోడీ సర్కార్ తనను తాను రక్షించుకోవడానికి రాష్ట్రాల అప్పులను వేలెత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.   నిజమే ఏపీ వంటి రాష్ట్రాలు వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నాయి. దానిని నియంత్రించాల్సిన కేంద్రం ఇంత కాలం ఎందుకు మిన్నకుంది. రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే…అందుకు ముందుగా తప్పుపట్టాల్సింది కేంద్రాన్నే.  శ్రీలంక పరిస్థితులను బూచిగా చూపి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చి ఊరుకుంటే చేసిన తప్పిదాలు సమసిపోవు.  ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి.  

By
en-us Political News

  
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.