హస్తిన వేదికగా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా!

Publish Date:Jun 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒక యువ నాయకుడు ఆంధ్రప్రదేశ్   ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్,  మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీకి ఆయన వాయిస్ రీసౌండ్ తో చెవులు దిబ్బళ్లు పడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన  ఎక్స్‌ప్రెస్ అడ్డా చర్చాగోష్ఠిలో లోకేష్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక  ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్  గ్రూప్ నిర్వహించిన ఈ   కార్యక్రమంలో లోకేష్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చిఅందరినీ ఆకట్టుకున్నారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా లోకేష్ జాతీయ మీడియాకు సంబంధించిన ఇంత పెద్ద వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. 

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆమె సంధించిన పలు కీలకమైన, ఆసక్తికరమైన ప్రశ్నలకు నారా లోకేష్   లోతైన విశ్లేషణతో  సమాధానాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఐటీ రంగం విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి, ప్రస్తుత రాజకీయ పరిణామాలు,  యువతకు ఉపాధి కల్పన వంటి అనేక అంశాలపై జరిగే     ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే   అత్యున్నత ప్రముఖులను మాత్రమే  ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ,  నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది. 

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా   కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్,   తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఐటీ,  ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆయన, 2024 శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 91 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ రికార్డు స్థాయి విజయం ఆయన నాయకత్వ పటిమకు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.  

ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఎక్స్ ప్రెస్ అడ్డా చర్చా కార్యక్రమంలో  ఏపీలో జరుగుతున్న  మార్పులు, కూటమి ప్రభుత్వ ప్రణాళికలను జాతీయ స్థాయి మేధావులకు లోకేష్ వివరించారు.   జాతీయ రాజకీయాల్లోనూ, మీడియా సర్కిల్స్‌లోనూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ,  పారిశ్రామిక పరిణామాలు ఎంతటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయో   ఎక్స్ ప్రెస్ అడ్డా స్పష్టం చేసింది. ఒకవైపు నవ్యాంధ్ర నిర్మాణంలో ఐటీ పగ్గాలు పట్టుకుంటూ, మరోవైపు జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు లోకేష్ వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి. 

By
en-us Political News

  
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.