కేంద్రం సాంకేతిక ఆలోచ‌న‌.. విద్యుత్ వాహ‌నాలు

Publish Date:Jul 18, 2022

Advertisement

ఉన్న‌ది వండి వార్చ‌డం రాదుగాని వ‌డియాలు పెడ‌దామ‌న్న‌దిట వెన‌క‌టికి  ఓ పెద్దామె. అస‌లే దేశంలో విద్యుత్ రంగం అధ్వాన్నంగా వుంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుంటే మోదీ స‌ర్కార్ విద్యుత్ వాహ‌నాల‌కు వీలు క‌ల్పించే ప‌నిలో ప‌డింది. పైగా కాలుష్య నివార‌ణ‌కు ఇదే  గొప్ప మార్గమ‌ని  బిజెపీ స‌ర్కార్  ప్ర‌క‌టిం చింది. కాలుష్యం పెరిగిపోతోంద‌న్న‌ది దేశంలో ఎవ‌ర్న‌డిగినా చెబుతారు. కానీ కాలుష్య‌ నియంత్ర ణ సంస్థ ల నిర్వాకం గురించి గ‌ట్టిగా ఏ ప్ర‌భుత్వ‌మూ ప‌ట్టించుకున్న‌పాపాన పోలేదు. ఇపుడు హ‌ఠాత్తుగా  విద్యుత్ వాహ‌నాలకు హైవేల‌ను   అనువుగా మార్చ‌డానికి  ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నారు.

దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్‌ భారీ ప్రణాళికలు  రచిస్తోం ది. టెక్నాలజీని ఉపయోగించి వాహనాలకు మెరుగైన హంగులు అద్దుతోంది. విద్యుత్‌తో నడిచే రైళ్ల మాదిరి గానే  ఇక వాహనాలు కూడా నడవనున్నాయి. హైవేల వెంట ఎలక్ట్రిక్‌ వైర్లను ఏర్పాటు చేసిన వాహనాలు విద్యుత్‌తో నడిచే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది కేంద్రం. విద్యుత్ వాహ‌నాలు ఉత్ప‌త్తిచేస్తున్న‌వారు వాటి వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని గ్ర‌హించి వెన‌క్కి తీసుకోవ‌డం చూస్తున్నాం. ఇపుడు  ప్ర‌త్యేకించి విద్యుత్ లైన్లు వేసి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. కానీ చీటికీ మాటికీ ఓవ‌ర్‌లోడ్‌, వ‌ర్షాల తో విద్యుత్ లైన్లు దెబ్బ‌తినే ప‌రిస్థితి వున్న మ‌న దేశంలో ఈ సాంకేతిక ఆలోచ‌న ఏ మేర‌కు స‌ఫ‌ల‌మ‌వు తుంద‌న్న‌ది ఆలోచించాలి. 

ఇక ఢిల్లీ  ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మిం చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అక్కడ ఓవర్ హెడ్ వైర్ల సాయంతో వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన విష యం తెలిసిందే. అన్ని జిల్లాలను నాలుగు లేన్ల రహదారితో అనుసంధానించాలని ఆయన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కాలుష్యాన్ని తగ్గించేం దుకు భారీ వాహన యజమానులందరూ ప్రత్యామ్నాయ ఇంధ నాలైన ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఈజ్‌లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

ఎలక్ట్రిక్‌ హైవే అంటే వాహనాలు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్‌ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఈ విద్యుత్‌ లైన్లు ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీ బస్సులు, ట్రాలీ ట్రక్కులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నిర్మూలించ డంతో పాటు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయనున్నా రు. రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరుగుతుండటంతో  ఆర్‌టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్‌ చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడమే తమ లక్ష్య మని అన్నారు.

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.