Publish Date:Jul 18, 2022
ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాలతో పిల్లల పెళ్లిళ్లు కాస్తంత ఆలస్యంగానే జరుగుతున్నాయి. కొందరు తమ వృత్తిలో వున్నవారినే ఇష్టపడుతున్నారు, మరికొందరు బ్యాంకర్లను, ఇంకొందరు అంత అర్జెంటే మిటి తర్వాత చూద్దాంలే అన్న ఆలోచనలోనూ వున్నారు. దీనికి అమ్మాయి, అబ్బాయి అని లేదు ఇద్దరూ ఒకే విధంగా ఆలోచించడమే ఈ కాలం విడ్డూరం. అయితే మధురై విల్లుపురానికి చెందిన జగన్ మాత్రం కొత్త ఆలోచన చేశాడు. మాట్రిమోనియల్ సంస్థల్లో పేరు నమోదుచేసుకోవడం వాటి చుట్టూ తిరగడం ఇష్టం లేదేమో.. తన వివరాలు, ఫోటోతో నగరంలో ఏకంగా పోస్టర్లే పెట్టేశాడు.
విల్లుపురానికి వెళ్లే వాహన దారులంతా ఆ పోస్టర్లు చూసి కొత్త కార్పోరేటరో, రాజకీయ యువ నేత అనే భ్రమ లో వున్నారు. కానీ కాస్తంత ఆగి చూస్తే అదేమికాదండీ.. అమ్మాయి కోసం వేటలో వున్నాడన్నది పోస్టర్ చెబుతోంది! మార్కెటింగ్ లో పనిచేస్తున్న జగన్ ఈ పోస్టర్లకి ఏకంగా రెండు లక్షలు ఖర్చుపెట్టాడట!
ఈ అత్యాధునిక ఆలోచన చేసిన వరుడు ఎం.ఎస్. జగన్ తనకు తగిన అమ్మాయి వేటలో వున్నాడు. గత ఐదేళ్లుగా తగిన అమ్మాయి కోసం వెతుకులాడటంలో ఈ ఉపాయం అమలు చేశాడు. ఇలా తనని తాను పెళ్లిళ్ల మార్కెట్లో పెట్టుకోవడం బాగా ఖర్చుతో కూడిన పనే అయినా మనోడు ధైర్యం చేశాడు. అన్నట్టు జగన్‌కి స్పూర్తినిచ్చింది.. లండన్ కుర్రాడి కధ.
జీవన్ భాచు అనే భారతీయ సంతతికి చెందిన కుర్రాడు అక్కడ రెండు పెద్ద హోర్డింగ్‌లను అద్దెకు తీసుకుని తాను మంచి భర్తను కాగలనని వివరిస్తూ పోస్టర్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇంతకంటే మంచి ఇండియన్ మీకు భర్తగా లభించడు అనీ టాగ్ లైన్ పెట్టాడు! కానీ మన జగన్ మాత్రం తన పోస్టర్‌లో ఫోటోతో పాటు తన వివరాలనూ తమిళంలో పెట్టాడు. విల్లుపురంకేసి వెళితే ఇతగాడి సంగ తేమిటో తెలుసుకోండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/villupuram-groom-39-140012.html
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.