నిన్నటి దాకా దావోస్ లో.. ఇప్పుడు ఢిల్లీలో బాబు బిజీబిజీ

Publish Date:Jan 24, 2025

Advertisement

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప విశ్రాంతి, విరామం అన్న మాటే ఆయనకు తెలియదు. వరుసగా నాలుగు రోజుల పాటు దావోస్ లో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అక్కడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కూడా క్షణం తీరిక లేకుండా కేంద్ర మంత్రులతో వరస భేటీలకు రెడీ అయిపోయారు. దావోస్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగి వరల్డ్ ఎకనామిక్  ఫోరం సదస్సు గురువారం (జనవరి 23) ముగిసింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ నాలుగు రోజులూ చంద్రబాబు క్షణం తీరిక లేకుండా    ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో  భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో  పాల్గొని ఏపీ బ్రాండ్ ను సక్సెస్ ఫుల్ గా ప్రమోట్ చేశారు. 

ఈ సదస్సు వేదికగా రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అన్న ప్రకటనలేవీ వెలువడలేదు. ఆర్భాటపు ప్రకటనల జోలికి పోకుండా బ్రాండ్ ఏపీ ప్రమోషన్.. వాస్తవాల ప్రాతిపదికన తాము చర్చించిన సంస్థలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడుల ప్రకటన చేయాలని కోరారు. చంద్రబాబు దావోస్ పర్యటన లక్ష్యం నెరవేరింది. ప్రపంచ దిగ్గజ సంస్థలు త్వరలో తమ ప్రతినిథి బృందాన్ని ఏపీకి పంపనున్నట్లు పేర్కొన్నాయి. వాస్తవానికి దావోస్ ఆర్థిక సదస్సు ఉద్దేశం కూడా అదే. 

దావోస్‌ వేదికగా ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోనం సదస్సు  పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడులను ఆకర్షించాలనుకునేవారికి మధ్య ఓ వారధి. ఈ సదస్సు వేదికగా  ఇటు ఇన్వెస్టర్లు, అటు ఆ ఇన్వెస్ట్ మెంట్లను ఆకర్షించాలనుకునే వారు తమ తమ అవకాశాలను అక్కడ ప్రజంట్ చేసుకుంటారు.  హడావుడి ఒప్పందాల కంటే వాస్తవాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చేసుకునే ఒప్పందాలే గ్రౌండ్ అవుతాయి.  అలా కాకుండా సదస్సులో ఆర్భాటంగా  చేసుకునే ఎంవోయూలలో గ్రౌండింగ్ అయ్యేవి చాలా చాలా తక్కువ.   ఆ రకంగా చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ ను సక్సెస్ ఫుల్ గా చేశారనే చెప్పాలి. ఇక ముందు ఏపీకి కంపెనీల ప్రతినిధులు క్యూ కడతారని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన విజన్, ఆయన అనుభవం, ఆయన అమలు చేసే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాల గురించి తెలియని పారిశ్రామిక వేత్త లేరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత ఆయనదే.

ఇప్పుడు ఆయన బ్రాండ్ ఏపీ గురించి ప్రమోట్ చేశారు. తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం (జనవరి 23) అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇక శుక్రవారం (జనవరి 24) ఆయన హస్తినలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపి అదే రోజు సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు. హస్తినలో ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషీ తదితరులతో భేటీ అవుతారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోనూ భేటీ అవుతారు.  

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.