కడపకు సీబీఐ బాస్?.. వివేకా కేసులో పెద్ద‌ల‌ అరెస్ట్ త‌ప్ప‌దా?

Publish Date:Mar 3, 2022

Advertisement

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును మరింత పెచ్చింది. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి సీబీఐ ఉన్నతాధికారులు గురువారం నేరుగా కడపకు వస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సైతం వీరు నోటిసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు..ఇప్పటికే వీరిద్దరికీ సీబీఐ నోటీసులు జారీ చేసిదంటూ ఓ వార్త అయితే జిల్లావ్యాప్తంగా జోరుగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా వీరిని సీబీఐ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం.

వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు ఇచ్చిన ప్రతి వాంగ్మూలంలో వైయస్ అవినాశ్ రెడ్డి పేరు ఉందన్న  సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అయన్ని ఒకటి లేదా రెండు రోజుల్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుంటారని సమాచారం. ఓ వేళ ఆయన్ని అదుపులోకి తీసుకుంటే జిల్లాలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సీబీఐ ఉన్నతాధికారులు చర్చించినట్లు కూడా తెలుస్తోంది.    

ఈ ఫిబ్రవరిలో సీబీఐ డీఐజీ చౌరసియా ఢిల్లీ నుంచి కడప వ‌చ్చారు. ఆయన జిల్లా సెంట్రల్ జైల్‌లోని అతిథి గృహంలోనే దాదాపు వారం రోజుల మకాం వేసి.. మరీ వివేకా హత్య కేసులోని అన్నీ పరిణామాలను ఆయన ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే అప్పడే ఈ కేసులో కీలక నిందితులకు భేడీలు పడతాయనే ప్రచారం కూడా గట్టగానే నడిచింది. కానీ అది చివరి నిమిషంలో ఆగిందని సమాచారం. అయితే ఫ్యాన్ పార్టీకి చెందిన కీలక నేత.. ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున లాబీయింగ్ జరపడం వల్ల .. ఈ అరెస్ట్ ఆగినట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా.. ఈ వివేకా హత్య కేసులో నిందితులు ఎవరంటే.. అందరి వేళ్లు.. వైయస్ అవినాశ్ రెడ్డి వైపు చూపిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. వివేకా హత్య కేసులోని నిందితులు ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్నారన్న విషయం విధితమే.   

2019, మార్చి 15వ తేదీన పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఆయనది గుండె పోటు అంటు ప్రచారం జరిగింది. కానీ ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ విషయంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం వ్యవహారించిన తీరు అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో వైయస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైయస్ సునీత ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ  ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు దర్యాప్తు కొంత కాలం నత్తనడకలా సాగినా.. ఆ తర్వాత.. సీబీఐ తనదైన శైలిలో దూకుడు పెంచింది. అదీకాక.. వివేకా మాజీ కార్ డ్రైవర్ అప్రూవర్‌గా మారి.. ఈ కేసులోని అన్ని విషయాలు సుపారీతో సహా సీబీఐ ముందు పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ పని కాస్తా సులువు అయిందనే టాక్ కూడా బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ పైనే కాకుండా ఆ సంస్థ ఉన్నతాధికారులపైన.. వివేకా కుమార్తె, అల్లుడిపైన కూడా కేసులు పెట్టేందుకు ఓ విధమైన తెరచాటు కుట్రకు నిందితులు శ్రీకారం చుట్టారు. దాంతో వివేకా హత్య కేసులో ఏం జరుగుతోందనేది ప్రజలకు అర్థం కాని పజిల్‌గా మరిపోయింది. ఆ క్రమంలో సీబీఐ సైతం సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత సీబీఐ.. ఈ కేసును ఛేదించేందుకు తనదైన శైలిలో ముందుకు దూసుకుపోయింది... పోతోంది.  మరికొద్ది రోజుల్లో ఈ హత్య కేసు వెనుక ఉన్న అసలు సూత్రదారులు, పాత్రదారులను ప్రజలు ముందు నిలబెట్టేందుకు సీబీఐ శక్తి మేర పనిచేస్తోంది.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.