వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ఎక్స్ పోజ్ అయిపోయినట్లేనా?

Publish Date:Feb 20, 2023

Advertisement

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగించిందా.. అంటే వైసీపీ శ్రేణుల నుంచే ఔనన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఒక సారి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా మరో సారి విచారణకు పిలిచింది. ఈ సారి ఫిబ్రవరి 25న హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు రావాలని సీబీఐ ఆ నోటీసులలో ఆదేశించింది. అదే సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కరరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన ఎక్కడ విచారణకు హాజరౌతారో చెప్పాలని ఆయనకే ఛాయిస్ ఇచ్చింది.  భాస్కరరెడ్డికి నోటీసుల విషయం పక్కన పెడితే.. నెల రోజులు కూడా పూర్తి కాకుండా అవినాష్ రెడ్డిని రెండో సారి విచారణకు పిలవడంతో  అవినాష్ ను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తం అవుతుంది. తొలి సారి ఆయనను విచారణకు పిలిచిన సందర్భంలోనే అవినాష్ అరెస్టు పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎంపి కనుక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా సీబీఐ తీసుకుందని అప్పట్లోనే గట్టిగా వినిపించింది. పైగా ఆనవాయితీకి భిన్నంగా అప్పట్లో ఆయనను సాయంత్రం నాలుగు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించడంతో.. అదే రోజు రాత్రి అయనను అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. అయితే అప్పట్లో సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదు.. కానీ కీలక విషయాలను ఆయన నుంచి రాబట్టిందని అంటున్నారు. ముఖ్యంగా దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ చేరుకునేందుకు అవసరమైన కీలక సమాచారం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సీబీఐ.. సీఎం జగన్ ఓఎస్డీ, జగన్ సతీమణి భారతి పిఎలను విచారణకు పిలిచి ప్రశ్నించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.   వివేకా హత్య ఘటన  సాక్ష్యాలు  మాయం చేయడం దగ్గర నుంచీ, ఆయన గుండెపోటుతో మరణించారన్న ప్రచారం వరకూ అన్నిటా అవినాష్ రెడ్డి పాత్రే కీలకమనీ సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు.  

వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారిన క్షణం నుంచీ సీబీఐ దూకుడు పెంచింది. ఏపీలో విచారణ సందర్భంగా ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్నో అవరోధాలను ఎదుర్కొనడమే కాకుండా.. పలు అపవాదులనూ ఎదుర్కొంది. స్వయంగా దర్యాప్తు సంస్థ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. బెదరింపులూ వచ్చాయి. వీటన్నిటి వెనుకా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డే నని సీబీఐ నిర్ధారణకు వచ్చిందని చెబుతున్నారు. అందుకే కేసును ఏపీ నుంచి మార్చాలంటూ.. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంను ఆశ్రయించిన సందర్బంగా, సీబీఐ కూడా ఏపీ నుంచి కేసు విచారణను మార్చాలనే పేర్కొంది. ఆ సందర్బంగా సుప్రీం కోర్టుకు కేసు దర్యాప్తులో అవరోధాలకు సునీత చెప్పిన ప్రతి కారణమూ అక్షరసత్యమని వాగ్మూంలం కూడా ఇచ్చింది.  

వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ,  ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె  సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసింది.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కేసును తెలంగాణకు బదలీ చేసింది. అంతే అప్పటి వరకూ మందగమనంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తు ఒక్కసారిగా జోరందుకుంది.

కేసు హైదరాబాద్ కు మారిన తరువాత వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు జోరందుకోవడమే కాకుండా.. అంతకు మందు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందన్న అభిప్రాయాలు కూడా బలపడ్డాయి. ఇక గత జనవరిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన తరువాత ఈ హత్య కేసు పాత్ర ధారులే కాకుండా, వెనుక ఉన్న సూత్ర ధారుల విషయం కూడా వెలుగులోనికి వస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.