ఏపీలో కేసీఆర్ క్యాస్ట్ కార్డ్.. వైసీపీకి మద్దతుగా వ్యూహ రచన?

Publish Date:Feb 20, 2023

Advertisement

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ కు రాష్ట్రంలో చావో రేవో పరిస్థితి ఉంది. పార్టీ జాతీయ పార్టీగా మార్చిన తరువాత నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటుండటం, మరో వైపు తెలుగుదేశం కూడా తన ఉనికిని బలంగా చాటుతుండటంతో ఆయనకు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం సంగతి అటుంచి తెలంగాణలో అధికారాన్ని కాపాడుకోవడమే ముఖ్యంగా మారిపోయిన పరిస్థితి.

అయినా కూడా కేసీఆర్ దృష్టి అంతా తెలంగాణపై కంటే.. ఏపీ ముఖ్యమంత్రి, తన మిత్రుడు జగన్ కు మద్దతుపైనే ఉంది. తద్వారా తెలంగాణలో ఏపీ సెటిలర్స్ అండ తనకు దక్కేలా చూసుకోవాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఏ విధంగా అయితే ఏపీలో జగన్ అధికారానికి రావడానికి తోడ్పాటు అందించారో, అదే విధంగా వచ్చే ఎన్నికలలో కూడా సహకారం అందించాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల ఆందోళనలు, ఆగ్రహం రూపంలో విస్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. మరో సారి అధికారం అన్న వ్యూహంతోనే పావులు కదుపుతూ పరస్పర సహకారం కోసం ఎత్తులు వేస్తున్నారు.

అందులో భాగంగానే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు సమూలంగా మార్చేసే తెలుగుదేశం- జనసేన పొత్తును మొదట్లోనే విచ్ఛిన్నం చేయడంపైనే దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే కేసీఆర్ క్యాస్ట్ కార్డును ప్రయోగించాలని నిర్ణయించారు. ఏపీలో జనసేన తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళితే.. జగన్ మరోసారి అధికారం సాధ్యం కాదన్న అవగాహనతో ఉన్న కేసీఆర్.. అదే జరిగితే.. ఆ పొత్తు ప్రభావం బీఆర్ఎస్ పై కూడా తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికీ పటిష్టమైన, బలమైన క్యాడర్ బేస్ ఉండటం, అలాగే జనసేనానికీ తెలంగాణలో అభిమానుల అండతో పాటు కాపు సామాజిక వర్గం కూడా అండగా నిలుస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్.. ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవ కుండా  తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఒక వేళ ఆ రెండు పార్టీలూ పొత్తు కుదుర్చుకుంటే.. ఆ కూటమికి కీలకం కానున్న కాపు సామాజిక ఓట్లలో చీలికకు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే తొలుత ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన  మాజీ ఐఏస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకూ తోట చంద్రశేఖర్ జనసేనలో ఉన్నారు. అయితే కాపు సామాజిక వర్గాన్ని గంపగుత్తగా తనవైపు తిప్పుకోగలిగే సత్తా, సామార్ధ్యం ఆయనకు ఉన్నాయా అన్న విషయంలో కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా ను కూడా సంప్రదించారు. కన్నా కమలం పార్టీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్ ఆయనకు బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆహ్వానం పంపారు.

అయితే కన్నా ఆ ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తనను అడ్డుపెట్టుకుని కాపు సామాజిక ఓట్లు చీల్చాలన్న వ్యూహంలో భాగస్వామ్యం కాలేనని సున్నితంగా చెప్పారు. ఇక ఆ తరువాత కేసీఆర్ పవన్ కల్యాణ్ తో కూడా తెలంగాణలో పొత్తు విషయమై సంప్రదించారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ కూడా ఈ సంగతి అన్యాపదేశంగానైనా చెప్పారు. తెలంగాణలో జనసేన, బీఆర్ఎస్ పొత్తు ద్వారా ఇటు తెలంగాణలో లబ్ధి పొందడమే కాకుండా.. అటు ఏపీలో తన మిత్రుడు జగన్ కు కూడా ప్రయోజనం చేకూరుతుందని కేసీఆర్ భావించారు. అయితే అందుకు జనసేనాని సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు.

మొత్తంగా జనసేన- తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పొసగకుండా చేయడం, అది కుదరకపోతే.. కాపు సామాజిక వర్గంలో చీలక ద్వారా లబ్ధి పొందడం అన్న లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకే తెలుగుదేశం, జనసేనల పొత్తు కుదిరితే.. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నను పదే పదే తెరమీదకు తీసుకురావడం ద్వారా జనసేన శ్రేణుల్లో.. ఆ డిమాండ్ బలంగా వినిపించేలా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ పని మొదలెట్టేసింది. ఫర్ సపోజ్ కలిసి పోటీ చేసి ఏపీలో అత్యధిక స్థానాలను తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబా? పవన్ కల్యాణా అని ప్రశ్నిస్తూ.. జనసేన శ్రేణుల్లో ఆశ, ఆశక్తి రేకెత్తించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇదే డిమాండ్ జనసేన శ్రేణుల నుంచి వస్తే.. ఇరు పార్టీల మధ్యా పొత్తు కుదిరినా క్షేత్ర స్థాయిలో ఓట్ల బదలీ జరిగే అవకాశం ఉండదన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

మరో వైపు తెలంగాణలో కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక వచ్చి.. ఆ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న కీలక  నియోజకవర్గాలలో బీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నది బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో తెలుగుదేశం- జనసేనల మధ్య పొత్తు అన్న మాటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీల అధినేతలను కలవరపాటుకు గురి చేస్తోందనడంలో సందేహం లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.