జై భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మార్మోగుతున్న నినాదాలు!

Publish Date:Feb 20, 2023

Advertisement

నిర్బంధం, వివక్ష, అభివృద్ధి లేమి.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) లో భారత అనుకూల ఆందోళనలకు దారి తీశాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, దివాళా తీసిన పాకిస్థాన్ ( ఆ దేశ రక్షణ మంత్రే దివాళా అని ప్రకటించారు), ఇప్పుడు వేర్పాటు ఉద్యమం.. కాదు కాదు పీవోకేలో భారత్ లో విలీనం డిమాండ్ లో విలీన ఉద్యమం తారస్థాయికి చేరింది.  

1947లో జమ్ము-కశ్మీర్ నుంచి కొంత భాగాన్ని పాకిస్థాన్  ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పిలుస్తున్నారు.  ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్ గా విభజించింది.  పాక్ ఆక్రమిత కశ్మీర్ జనాభా (అజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్) 2020 నాటికి దాదాపు  52 లక్షలు. 1947కు ముందు   పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా జమ్మూ-కశ్మీర్లో భామే.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని రెండు భాగాలలో ఒకటైనగిల్గిట్ బాల్టిస్టాన్ లో భారత్ లో విలీనం డిమాండ్ తో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

విభజన సమయంలో, జమ్మూ కశ్మీర్ భారతదేశం లేదా పాకిస్థాన్లో చేరాలా అనే అంశంపై ఆనాటి పాలకుడు మహారాజా హరిసింగ్ దానిని స్వతంత్ర దేశంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు.  అయితే జమ్ము-కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరణ తరువాత ఆ ప్రాంతం విలీనం గురించి ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని అప్పటి భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటిన్ సూచన మేరకు ప్రయత్నాలు జరిగినా.. అది జరగలేదు. అనంతరం హరిసింగ్ 1947 అక్టోబర్ లో   ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ కు  గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్  ఆమోదంతోనే కాశ్మీర్ వివాదానికి బీజం పడింది.  

ఏడు దశాబ్దాలుగా దోపిడీ, వివక్షలు అనుభవిస్తూ గడిపిన పాక్ ఆక్రమిత  కాశ్మీర్ ప్రజలకు భారత్ లో అభివృద్ధి, సంస్కరణలు తమ దయనీయ స్థితి నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపించాయి.  తాము ఒకపక్క అనేక సమస్యలతో సతమతమవుతుంటే తమకు పోరుగునే ఉన్న భారత్ లోని కశ్మీర్ అభివృద్ధిలో నడుస్తుండడంతో తాము కూడా భారత్ లో కలవాలన్న కాంక్ష పెరిగింది. అదే వారిని విలీన ఉద్యమానికి ఆకర్షితులను చేస్తున్నది.   

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.