శెలవుపై వెళ్ళనున్న జె.డి. లక్షీనారాయణ ?

Publish Date:Jul 5, 2012

Advertisement

జగన్‌ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సి.బి.ఐ. జాయింట్‌  డైరెక్టర్‌  లక్షీనారాయణ త్వరలో శెలవుపై వెళ్ల వచ్చని తెలిసింది. నిజానికి ఆయన శిక్షణ నిమిత్తం కొంతకాలం బైట ప్రదేశానికి వెళ్ళ వచ్చని మొదట ప్రచారం జరిగింది. అయితే మారిన పరిస్దితులు, ఫోన్‌ కాల్స్‌ పై హైకోర్టు కామెంట్స్‌ నేపధ్యంలో ఆయన కొంతకాలం శెలవులపై వెళ్ళవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

జెడి కాల్‌ లిస్టును వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాక్షి ఛానల్‌ లో పదేపదే ప్రకటించే వరకు ప్రజలెవరికీ  లక్ష్మీనారాయణ ఐజిగా పదవిని అంతగా దుర్వినియోగం చేస్తున్నారన్న అవగాహన లేదనే చెప్పాలి. ఆసమయంలో మరో మహిళ వాసిరెడ్డి చంద్రబాల జెడి కాల్‌లిస్టులో ఉన్నారు. అదికూడా అంతగా పట్టించుకునే వారు కాదోమోగాని, ఆమె కాల్స్‌నుండి వైసిపి కి  బద్ద శత్రువైన మరో ఛానల్‌ అధిపతికి కాల్స్‌ వెళ్లటంతో సంచలనం అయింది. జెడి, ఆ ఛానల్‌ ఎదురు దాడికి దిగి హెచ్‌ఆర్సీకి చంద్రబాల ద్వారా కంప్లైంటు ఇవ్వడం మరో వివాదం అయింది. గుంటూరునుండి  భూషణ్‌ బి బవన్‌ అనే వ్యాపారి కాల్‌లిస్టును జనవరి 1, 2001 వరకు ఇవ్వవలసినదిగా కోర్టు కెక్కారు. దీనిని స్వీకరించిన ధర్మాసనం సోమవారం జెడి లక్ష్మీనారాయణ అంతసేపు మీడియాతో మాట్లాడవలసిన పనేమిటని చివాట్లు పెట్టింది.  వైసిపి నాయకుడు జగన్‌  ఏకపక్షంగా విచారణ చేపట్టారని, కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని  జెడి మీద మోపిన అభియోగాలకు సాక్ష్యం దొరికినట్లయింది.

కొండ శిఖరం చేరుకోవటం కష్టమే కాని శిఖరం మీద స్థానాన్ని సుస్ధిరం చేసుకోవడం మరింత కష్టం. నిజాయితీకి, నిబద్దతకు పెట్టింది పేరన్నట్లుగా జనం హృదయాల్లో నిలచి పోవల్సిన అసాధారణ  ప్రజ్ఞా ప్రావిణ్యాలుగల ఐపియస్‌ ఆఫీసర్‌ ఇంతకు తెగించడం విచారకరం. అరాచక శక్తుల్ని వేటాడతాడనుకుంటే తనే  వేటాడబడటానికి ఆయనే మార్గం పరచుకున్నారు. వైయస్సార్‌ పార్టీ గౌరవ అధినేత విజయమ్మ జాయింట్‌డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ మీద ఇప్పటికే రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవ్యవహారాన్ని  ప్రధానమంత్రికి బుధవారం వివరించామని విజయమ్మ చెప్పారు. తగిన సాక్ష్యాధారాలు కూడా అందచేశామని చెప్పారు. జగన్‌ ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందనికూడా వారు తెలియచేశారు. ఈ కేసునుండి లక్ష్మీనారాయణను తప్పించాలని కోరారు. ఒక సీబిఐ అధికారిమీద ఇంత దారుణమైన ఆరోపణలు రావడం చరిత్రలో ప్రధమం. ఇది ఆయన వృత్తి జీవితానికి తీరని కళంకం.
 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.