ఐఎఎస్ ల సీన్ మారింది..సీబీఐపై కాస్త కూల్
Publish Date:Feb 8, 2012
Advertisement
హైదరాబాద్: సీబీఐ తీరుతో రగిలిపోయిన ఐఎఎస్‌లు ఇప్పుడు కాస్త కూల్ అయ్యారు. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో సీబీఐపై ఒత్తిడి తేవాలని భావించిన అధికారగణంలో కాస్త మార్పొచ్చింది. తమ అభ్యంతరాలను ప్రభుత్వం, సీబీఐ, ప్రజల దృష్టికి తీసుకెళ్ళినందున తాత్కాలిక మౌనం పాటించాలని బ్యూరోక్రాట్లు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మార్, ఓఎంసీ, జగన్ ఆస్తుల కేసులో పలువురు ఐఎఎస్ అధికారులను సీబీఐ ప్రశ్నించడం, కొందరిని అరెస్ట్ చేయడంతో అలజడి మొదలైంది. పెద్ద చేపలను వదిలేసి తమను టార్గెట్ చేస్తున్నారంటూ ఐఎఎస్లంతా ఏకమయ్యారు. ఏది ఏమైనా సీబీఐని కట్టడి చేసేందుకు వ్యూహరచన చేశారు. మీటింగ్‌లు మీద మీటింగులు పెట్టి తప్పు తమదికాదంటూ ఉపన్యాసాలిచ్చారు. అయితే ఇప్పుడు సీన్ కాస్త మారినట్లు కనిపిస్తోంది. ఎమనుకున్నారో ఏమోగానీ ఇప్పుడు వర్క్ టు రూల్ సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నారు. బిజినెస్ రూల్స్‌ను తిరగేస్తూ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పైళ్ళకు మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్నారు. సర్వీసులో ఉన్న వారి పరిస్థితి ఇలా ఉంటే కేసుల్లో చిక్కుకొని సస్సెండయినవారు చేసే న్యాయపోరాటానికి బాసటగా ఉండాలని ఐఎఎస్‌ల సంఘం నిర్ణయించింది. అయితే భవిష్యత్ కార్యాచరణ, సీబీఐ కట్టడికి చేసే ప్రయత్నాలను చెప్పడానికి మాత్రం ఐఎఎస్‌లు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడ్డ అధికారులపై విచారణ తప్పదంటూ కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులు చేస్తున్న కామెంట్లు బ్యూరోక్రాట్లు రెండుగా చీలిపోయారా అన్న అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయ్. మొత్తం మీద మంత్రుల ప్రోద్బలంతా పలు వివాదాల్లో చిక్కుకున్న ఐఎఎస్‌లు ఇక మీదట పనితీరుతోనే అందరికీ సమాధానం చెప్పాలని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cbi-24-11734.html





