మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు..!
Publish Date:Aug 23, 2026
Advertisement
మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెం ట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో యష్‌ను చూడ్డానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు హాజరయ్యారు. ఈవెంట్ కొనసాగుతుండగా భారీ ఫ్లడ్‌లైట్ స్తంభం ఒక్క సారిగా కూలిపోవడంతో అక్కడున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా భయాందోళ నకు గురైన అభిమానులు, విద్యార్థులు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీ సులు మల్లారెడ్డి కాలేజీతో పాటు ‘టాక్సిక్’ చిత్ర యూనిట్‌పై కూడా కేసు నమోదు చేశారు. భారీగా అభిమానులు, విద్యా ర్థులు హాజరయ్యే కార్యక్రమానికి తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లడ్‌లైట్ స్తంభం ఎలా కూలింది? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? నిర్వాహకుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. Case registered against Mallareddy College, Toxic film unit, Maisammaguda, Hero Yash
http://www.teluguone.com/news/content/case-registered-against-mallareddy-college-24-229622.html





