పవన్ కల్యాణ్, రఘురామ రాజుపై పై వివాదాస్పద వ్యాఖ్యలు.. జడ శ్రవణ్ కుమార్ పై కేసు

Publish Date:Jul 1, 2026

Advertisement

జై భీమ్ భారత్ పార్టీ  అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌పై ఏలూరులో కేసు నమోదైంది.  ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు లక్ష్యంగా  ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో,  రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి.   

గత నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవుల నిరసన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జడ శ్రవణ్ కుమార్   ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు  నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ  అభ్యంతరకరమైన,అనుచితమైన  వ్యాఖ్యలు చేశారు.  
ఈ వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా  తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏలూరులోని గొల్లాయిగూడేనికి చెందిన పెద్దాడ వెంకటరమణ అనే వ్యక్తి  జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, కులాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రగిలించేలా ఉన్నాయని పేర్కొంటూ..  ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిపై, ఉప ముఖ్యమంత్రిపై ఇలా  వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ ఫిర్యాదు మేరకు  ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..  సదరు నిరసన సభకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లను, సాక్ష్యాలను సేకరిస్తున్నారు.   పవన్ కల్యాణ్, రఘురామకృష్ణంరాజుల అభిమానులు, కూటమి శ్రేణులు జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన ఒక లాయర్ ఇలాంటి హింసాత్మక భాషను వాడటం సరికాదని మండిపడుతున్నారు. 

By
en-us Political News

  
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‎డీఎఫ్‎సీ (HDFC Bank) రుణగ్రహీతలకు షాకిస్తూ MCLR లోన్ వడ్డీ రేట్లను సవరించింది. పెరిగిన కొత్త రేట్లు, మీ హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తక్షణమే 22 ఏ సెక్షన్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తిరుగుబాటుతప్పదని హెచ్చరించారు. ఆ ప్రజా తిరుగుబాటు.. మరో రామ-రావణ యుద్ధాన్నితలపింప చేయడం ఖాయమన్నారు.
వరద ఉధృతికి స్పిల్‌ చానల్‌ మధ్య 902 హిల్‌ నుంచి మహానందీశ్వరస్వామి టెంపుల్ వరకు ఉన్న మట్టి, రాతి రవాణా కాజ్‌వేకు గండిపడింది. ప్రాజెక్టు పనుల కోసం వాహనాలు తిరిగేలా నిర్మించిన ఈ కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోతుండటం భక్తులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
భారతీయ పర్యాటకుల కోసం సౌదీ అరేబియా సరికొత్త ప్యాకేజీ వీసా విధానాన్ని తెచ్చింది. ఫ్లైట్, హోటల్ రూమ్స్ మరియు వీసా ఒకే క్లిక్‌తో బుక్ చేసుకునే పూర్తి ప్రాసెస్, అర్హతల వివరాలు ఇక్కడ చూడండి.
అహ్మదాబాద్‌కు చెందిన ప్యాకేజింగ్ దిగ్గజం న్యాక్ ప్యాకేజింగ్ Knack Packaging 83 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పటేల్ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ మరియు ఐపీఓ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి పేరుతో వచ్చిన నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన నమ్మి రూ.85 లక్షలు పోగొట్టుకున్న ప్రముఖ డాక్టర్. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు వివరాలు మీకోసం.
భారత్,ఇంగ్లాండ్ 3వ టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ స్టంపింగ్ వివాదంపై థర్డ్ అంపైర్ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఐసీసీ క్రికెట్ నిబంధనలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన 23 ఏళ్ల మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, 27 ఏళ్ల ఎండీ డానిష్, 23ఏళ్ల మీర్జా సోహైల్ బేగ్‌లతో పాటు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం ఉన్నారు.
ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4,3 తేడాతో స్విట్జ‌ర్లాండ్ చారిత్రక విజయం సాధించింది. రూబెన్ వ‌ర్గాస్ నిర్ణయాత్మక గోల్‌తో 1954 తర్వాత తొలిసారి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన స్విస్ జట్టు, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
భారీ వర్షాలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ముంబై,పుణే రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్, విశాఖ రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు, టికెట్ రీఫండ్ రూల్స్ మరియు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కట్టేటప్పుడు కోవిడ్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యమైతే సెక్షన్ 54 కింద లభించే ఆదాయపు పన్ను మినహాయింపు రద్దవుతుందా చెన్నై ఐటీఏటీ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.