కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపేనా?

Publish Date:Oct 27, 2025

Advertisement

కల్వకుంట్ల కవిత జనం బాట పాదయాత్రను శనివారం (అక్టోబర్ 25) నిజమాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలలో పర్యటించనున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట తాను ఎక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారో సరిగ్గా అదే నియోజకవర్గం నుంచి ఆమె తన కొత్త రాజకీయ బాట పట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగంలో.. సొంత పార్టీయే తనను దగా చేసిందని చెప్పుకొచ్చారు.  బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా తనకు వ్యతిరేకంగా చేసిన కుట్రవల్లనే తాను నిజామాబాద్ లో పరాజయం పాలయ్యానన్నారు. జనం కాదు.. తనను సొంత పార్టీయే ఓడించిందని చెప్పుకున్నారు.  

తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తనకు అపార గౌరవం ఉందని చెప్పిన కవిత.. ఆ కారణంగానే పార్టీలో తనకు ఎన్ని అవమానాలు జరిగినా నిశ్శబ్దంగా ఉన్నాననీ, అయితే ఇప్పుడు.. తనను పార్టీ నుంచి బయటకు పంపేశారనీ, అందుకే తిరిగి తన ప్రజల వద్దకు వచ్చానన్నారు.  
ఈ సందర్భంగా కవిత తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ ప్రధానంగా ఆమె ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా సాగింది. వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ సందర్భంగా వారి అవినీతిని ప్రశ్నించిన కారణంగానే తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకున్నారు. చర్విత చరణమే అయినా కవిత.. తాను తెలంగాణ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్లు చెప్పుకున్నారు.

ఈ క్రమంలోనే ఆమె తాను కోత్త రాజకీయపార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. తాను స్వతంత్రంగా, స్వంతంగా రాజకీయాలలో రాణించాలని భావిస్తున్నట్లు చెప్పిన కవిత, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  అయితే ఒకే  సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆమె ఎవరిని బెదరించాలని చూస్తున్నారో అవగతం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు.కవిత తెలంగాణ రాజకీయాలలో బలీయమైన శక్తిగా ఎదుగుతారా? లేదా వేచి చూడాల్సిందేనంటున్నారు.  

By
en-us Political News

  
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.