కేబినెట్ మొత్తం క్లీన్‌స్వీప్‌.. మంత్రులు ఉన్నా ఒక‌టే, ఊడినా ఒక‌టేనా?

Publish Date:Sep 27, 2021

Advertisement

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన కసరత్తుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత మంత్రులలో కొద్ది మంది మినహా మిగిలిన అందరికీ ఉద్వాసన తధ్యమని చాలాకాలంగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అలాగే, తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలోనే మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తోంది. జ‌గ‌న్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన నవంబర్ 30, 2021తో రెండున్నరేళ్ళ గడువు ముగుస్తుంది. ఈ  నేపధ్యంలో ఫస్ట్ బ్యాచ్‌లో బెర్త్ మిస్సయిన సీనియర్లతో పాటుగా ఇతరత్రా ఈక్వేషన్స్’లో బెర్త్ ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఈసారి తమకు తప్పక అవకాశం దక్కుతుందని ఆశగా ఉన్నారు. మరోవంక ప్రస్తుత మంత్రుల్లో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు. 

అదలా ఉంటే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా, ‘మంత్రివర్గంలో అందరినీ మార్చేస్తారు. వందశాతం మార్పు ఖాయం’ అంతా కొత్త వారినే తీసుకుంటారు అంటూ బాంబు పేల్చారు. మిగిలేది ముఖ్యమంత్రి ఒక్కరే, మిగిలిన అందరికీ ఉద్వాసన తథ్యం అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే తనకు ఈ విషయం చెప్పారని బాలినేని ముక్తాయింపు నివ్వ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఇంత వరకూ తమ కుర్చీకి డోకా లేదని ధీమాగా ఉన్న సీనియర్లు, ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేశామని కొందరు జూనియర్లు కూడా, ఇప్పడు మంత్రి బాలినేని స్టేట్మెంట్’తో కంగారు పడుతున్నట్లు సమాచారం. నిజానికి, కొద్ది రోజుల క్రితం వరకు కూడా కనీసం ఒక అరడజను మంది వరకు ‘సేవ్’ అవుతారని అనుకున్నారు. కానీ, బహుశా గుజరాత్’లో బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గానికి ఒకేసారి ఉద్వాసన పలికిన నేపథ్యంలో జగన్‌రెడ్డి కూడా మనసు మర్చుకున్నారో ఏమో, అనే మాట పార్టీలో వినవస్తోంది. మరోవంక మంత్రి బాలినేని  మొత్తానికి మొత్తం మంత్రులు  అందరికీ ఒకేసారి ఉద్వాసన పలికే నిర్ణయం నూటికి నూరు శాతం చక్కని, సముచిత నిర్ణయమని ప్రకటించారు.  

అయితే, మంత్రులను మార్చి ప్రయోజనం లేదని, ముఖ్యంత్రిని మారిస్తేనే కానీ, రాష్ట్రానికి మేలు జరగదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. సర్వ అనర్ధాలకు మూలమైన ముఖ్యమంత్రిని వదిలేసి మంత్రులను తొలిగించినా, తొలిగించక పోయినా ఒకటేనని విపక్షాలు అంటున్నాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదు, ముఖ్యమంత్రిని మార్చాలి” అని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలని, ఆరవ వేలుతో సమానమని విమర్శించారు. వారు మంత్రులుగా ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటేనన్నారు. ప్రస్తుతం ఏపీలో సమస్య ముఖ్యమంత్రి జగనేనన్నారు. రాష్ట్రం అప్పులు, అరాచకం, అవినీతి, అసమర్ధత, ఆటవిక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని, వీటన్నిటికీ మూలకారకుడు ముఖ్యమంత్రి అని తుల‌సీరెడ్డి  అన్నారు. జగన్‌ని మారుస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని ఆయన కుండబద్దలు కొట్టారు. 

ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడం అంటే... చేతగాని వైద్యడు పంటినొప్పికి తుంటి మీద తన్నినట్లేనని తులసిరెడ్డి తమదైన స్టైల్లో వ్యగ్య బాణాలు వేశారు. నిజానికి, ఏపీలో మంత్రులు పేరుకు మంత్రులే కానీ, వారికి ఉన్న అధికారాలు అంతంత మాత్రమే. సో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్యమంత్రి మార్పు ఒక్కటే పరిష్కారం అనేది సరైన ఆలోచనే అవుతుందని విశ్లేషకులు సైతం అంటున్నారు.
 

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.