ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది. ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలలో ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది.
ఆయన హార్ట్ లో మూడు వాల్వ్ లు పూర్తిగా మూసుకుపోయాయని తేలడంతో తొలుత స్టంట్ లు వేయాలని వైద్యులు భావించారు. అయితే మూడు వాల్వులు పూర్తిగా మూసుకుపోయి ఉండటంతో పాటు కిడ్నీ సమస్య కూడా ఉండటంతో నాని కుటుంబ సభ్యులు ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ కార్డియాక్ సెంటర్ తకు తరలించాలని నిర్ణయించుకున్నారు.
దీంతో నాని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ చేసి అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు బుధవారం (ఏప్రిల్ 2) బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bypass-surgery-to-kodali-nani-39-195464.html
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24 వ జాతీయ మహాసభ లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. కొత్తగా పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ లో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానం దక్కింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కొండ్రు మురళీ మెహన్ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దళిత నాయకుడు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న రాజంతో పాటు, గతంలో పోటీ చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిరంతరం యాక్టివ్ పాలిటిక్స్ నడిపించే ఆ లీడర్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.
గిరిజన గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం(ఏప్రిల్ 7) అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండల పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరి కొరివితో తలగోక్కుంటున్నట్లుంది. ఆయన ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు సోమవారం ప్రపంచంలోని ప్రధాన సూచీల్లో ఒక్కటీ లాభాల్లో లేకుండా పోయాయి.
భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధించకముందే, దిగ్గజ సంస్థ యాపిల్ ముందు జాగ్రత్త పడింది. భారత్ నుంచి 3 రోజుల్లోనే, 5 సరకు రవాణా విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను తరలించినట్లు సమాచారం
భారత ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం సోమవారం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2017 నుంచి భారత్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలవుతుంది. అంటే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ పెద్దగా తేడా ఉండదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పట్టు మని పదిహేను నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో కొంచెం చాలా ఎక్కువగానే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో అసమ్మతి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. విపక్షాలు సరే సరి ఆశించిన దాని కంటే ముందే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని సంబర పడుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదివారం (ఏప్రిల్ 6) ఓ పేదోడి ఇట్లో నేలపై కుర్చుని సహపంక్తి భోజనం చేశారు.ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇంచక్కా కాళ్ళు మడిచి నేలపై కూర్చునే, భోజనం చేశారు. నిజానికి, ముఖ్యమంత్రి ఒక్కరే కాదు,మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, గత వారం పది రోజులుగా, ఇలా పేదల ఇళ్లలోనే చేతులు కడుగుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 7) జరనిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డెప్యుటీ కలెక్టర్ మరణించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన ఎణిమిది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు సోమవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికైన ఎనిమిది మందిలో ఏడుగురి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం (ఏప్రిల్ 7) ప్రమాణ స్వీకారం చేయించారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ సీఐడీని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇహనో.. ఇప్పుడో వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కానున్నారా? ఆంధ్రప్రదేశ్ సీఐడీ బృందాలు ఢిల్లీలో ఉండటానికి కారణం అదేనా. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ మంగళవారం(ఏప్రిల్ 7) విచారణకు రానుంది.
పిఠాపురంలో అసలేం జరుగుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకర్గం పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి.