మోదీ కొత్త నోటుకు ఓటేసిన జనం!
Publish Date:Nov 22, 2016
Advertisement
దేశంలో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న సమస్య ఏంటి? నోట్ల సమస్యే! 500, 1000 నోట్ల రద్దు తరువాత ఏ బ్యాంక్, ఏటీఎం దగ్గర చూసినా జనం కిటకిటలాడిపోతున్నారు! వంద నోట్ల కోసం కటకటలాడిపోతున్నారు! మరో వైపు విపక్షాలు ఢిల్లీ రోడ్ల మీద నుంచీ పార్లెమంట్ దాకా ప్రతీ చోటా హంగామా చేసేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, మమత, రాహుల్ గాంధీ అయితే మోదీని తెగ ఇరుకున పెట్టేశామని ఫీలైపోతున్నారు. కాని, నిజంగా గ్రౌండ్ లెవల్ పరిస్థితి ఏంటి? ప్రధాన మంత్రిని జనం... రాజకీయ నేతలు, మీడియా విమర్శించనంత విమర్శిస్తున్నారా? నోట్ల కట్టల కోసం వాళ్లలో కోపం కట్టలు తెంచుకుంటోందా?
ప్రజాస్వామ్యంలో పాలకులపై జనానికున్న అభిప్రాయం పక్కగా తెలిసేది ఎన్నికల ద్వారానే. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై కూడా ప్రజల్లో ఏ అబిప్రాయం వుందో తెలియాలంటే ఎలక్షన్స్ రావాల్సిందే. కాని, పూర్తి స్థాయి మెజారీటితో వున్న ప్రస్తుత గవర్నమెంట్ ఫుల్ లెంగ్త్ ఎలక్షన్స్ ఎదుర్కొనేది 2019లో. అంత దాకా జనం బ్యాలెట్ ద్వారా మోదీపై తమ అభిప్రాయం చెప్పే ఛాన్స్ లేదు. కాని, ఇవాళ్ల విడుదలైన బై పోల్స్ రిజల్ట్స్ ఒకింత జనం మనసులో ఏముందో విప్పి చెప్పాయి!
నవంబర్ 8న మోదీ నల్లధనం నియంత్రణకి పెద్ద నోట్లు రద్దు చేశాక... నవంబర్ 19న దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. రకరకాల కారణాలతో ఖాళీ అయిన ఈ స్థానాల్లో బీజేపి సిట్టింగ్ ఎంపీలు వున్నవి అసోమ్, మధ్య ప్రదేశ్ లో మాత్రమే. సో... నోట్లు లేక జనం నానా యాతన పడుతున్న సమయంలోనే అసొమ్, మధ్యప్రదేశ్ లలో ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చారన్నమాట. విపక్షాలు, మీడియా ఈ బైపోల్స్ లో బీజేపి ఓటమిపాలైతే ఆ నెపమంతా నోట్ల రద్దుపై రుద్దుదామని ఎదురుచూశాయి. కాని, మోదీ అదృష్టం కొద్దీ బీజేపి గెలిచే అవకాశం వున్న రెండు రాష్ట్రాల్లో తమ పూర్వ స్థానాల్ని అలాగే కాపాడుకుంది. భారీ మెజార్టీలు కూడా నమోదు అయ్యాయి. మొత్తానికి ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూలలో వున్న జనం పోలింగ్ బూత్ క్యూలలో నిలబడి మోదీని శిక్షిస్తారనుకున్న విపక్షాల ఆశ నెరవేరలేదు....
బై పోల్స్ ఇచ్చిన జోష్ లో వున్న మోదీ తమ పార్టీ ఎంపీలకు గట్టి సందేశం ఇచ్చారు. నోట్ల రద్దు నల్లధనం విషయంలో మొదటి మెట్టు మాత్రమేనని స్పష్టం చేశారు. ముందు ముందు ఇంకా చాలా యాక్షన్ వుంటుందని తేల్చేశారు! అంతే కాదు, జనం తన యాప్ లో లాగిన్ అయ్యి తమ అభిప్రాయం చెప్పొచ్చని కూడా పిలుపునిచ్చారు. డిమానిటైజేషన్ నచ్చిందా? లేదా? అంటూ సూటి ప్రశ్న వేశారు! ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అత్యధిక జనం మోదీ వెంట వున్నట్టుగానే కనిపిస్తోంది!
http://www.teluguone.com/news/content/by-polls-results-45-69374.html





