ఇల్లు కొనండి.. రెండుదేశాల్లో నివసించండి!
Publish Date:Aug 3, 2022
Advertisement
ఫ్రిజ్ కొనండి.. ప్లాస్టిక్ బాటిల్ ఫ్రీ, ఐదు కిలోల కూరలు కొనండి.. పావు పచ్చిమిరపకాయలు ఫ్రీ.. ఇలాంటి గిఫ్టులు మనదేశంలో బహుప్రసిద్ధం. గృహిణులకు ఇలా గాలం వేసి పెద్ద పెద్ద మాల్స్‌వారంతా వారిచేత పర్సులు ఖాళీచేయించడం తరచూ గమనిస్తూనే ఉంటాం. మార్కెటింగ్ ఓ పిచ్చి. అవసరం ఉన్నా లేకు న్నా ఏదో ఒక వస్తువు కొనాలన్న కొనుగోలుదారుని బలహీనతే వ్యాపారులకు పెద్ద అసెట్ అనేది వ్యాపార స్తుల ఆదాయ సూత్రం. కానీ ఇల్లు కొనండి గొళ్లెం ఫ్రీ అనరుగాక అనరు. చిత్రమేమంటే ఓ పెద్ద విల్లా కొంటే రెండు దేశాల్లో ఉండేందుకు వీలు కల్పిస్తామనే ప్రకటనా వచ్చింది. ఇదెలా సాధ్యం? అందులో ఏదో మర్మం ఉండవచ్చు.. బహుశా ఆ విల్లాలో దెయ్యాలేమన్నా ఉన్నాయేమోనని మనోళ్లకి సాధారణంగా వచ్చే పెద్ద అనుమానం! చిత్రంగానే ఉంది. ఒక విల్లా కొనడం ఆలస్యం వెంటనే రెండుదేశాల పౌరసత్వం లభిస్తుందనేది ఎలా నమ్మడం అనే ప్రశ్న కెనడా వాసులకు రాదు. ఎందుకంటే, కెనడాకి చెందిన క్యూబెక్, అమెరికా వెర్మాంట్ మధ్య ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని పెద్ద విల్లా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది కొనగలిగితే ఆ రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. అంటే ఇటు కెనడా, అటు అమెరికా పౌరసత్వం! తమాషాగా ఉంది. రెండు ఇళ్ల మధ్య, రెండు అపార్ట్‌మెంట్ల మధ్య కాస్తంత స్థలం కనపడితే ఇటువారో, అటువారో కబ్జా చేయాలన్న ఆలోచనతో రాత్రికి రాత్రి ఎవరో ఒకరు కొట్టేయాలనే ఆలోచిస్తారు. సరే ఇంతకీ ఈ విల్లాకి ఆశపడితే మాత్రం వెంటనే మన కరెన్సీలో అయితే జస్ట్ 71 లక్షలు కట్టాలి. ఈ విల్లా ఓనర్లు బ్రియాన్, జోవాన్ డుమోలిన్ దీన్ని నలభయ్యేళ్ల క్రితం వారసత్వంగా పొందారు. ఇది సరిగ్గా స్టాన్స్టడ్ రూ ప్రిన్సిపలె లో ఉంది. దీనికి ఒకవైపు కెనడా సరిహద్దు రక్షణ ఏజెన్సీ, మరో వేపు యు.ఎస్.కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ దళాలు రాత్రింబవళ్లూ కాపలా కాస్తుంటారు. మరో ఇబ్బందేమంటే ఈ విల్లాకి అన్ని వైపులా ఇష్టంవచ్చినట్టు తిరగడానికి అవకాశం లేదు. కేవలం పరిమిత ప్రాంతంలోనే, పరిమిత దారిలోనే తిరగాలి, వెళ్లడం రావడంచేయాలి. కాస్తంత నిర్లక్ష్యం చేసినా రెండు దేశాల సరిహద్దు రక్షణ విభాగం పోలీ సులూ జైల్లో వేస్తారు. అయితే యు.ఎస్, కెనడా నుంచీ కూడా ఈ విల్లా చేరడానికి మార్గం ఉంది. అంతే కాదు విల్లా వెనుక వైపు గతంలో ఒక మార్గం ఉండేది, దాన్ని యు.ఎస్ ఏజెంట్లు మూసేయించారు. ఇంత గందరగోళం విల్లాను ఎవరు తీసుకుని ప్రశాంతంగా ఉండగలరు? అందుకే కేవలం ఫోటోల్లో పెట్టి చూస్తూ ఆనందిస్తున్నారు. టెన్షన్ పడేకంటే టెంట్‌లో ఉండడం మేలు కదా!
http://www.teluguone.com/news/content/buy-villa-39-141154.html





