బ్యూరోక్రాట్లు.. రాజకీయాల్లో ఫెయిల్యూర్లు!?

Publish Date:Feb 16, 2026

Advertisement

భారత రాజ్యాంగం పరిపాలనను రెండు రకాలుగా వర్గీకరించింది. అందులో ఒకటి  ఎలక్టెడ్, రెండవది ఎంపిక (సెలెక్టెడ్).  ప్రజల ఓటుతో ఎన్నికలలో విజయం సాధించిన రాజకీయ నాయకులు ఎలెక్టెడ్ వర్గంలోకి వస్తారు.  ఉన్నత చదువులు చదివి సివిల్ సర్వెంట్లుగా పని చేసే వారు సెలెక్టెడ్ వర్గంలో ఉంటారు.   రాజకీయాలలో ముగిని తేలే   రాజకీయ నాయకులు ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్ సర్వెంట్ల అవతారం ఎత్తలేరు.  కానీ  ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన సివిల్ సర్వెంట్లు రాజకీయాలలోకి రావడానికి ఎటువంటి ఆంక్షలూ లేవు.

అయితే వారు రాజకీయాలలోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటేఉద్యోగంవదిలేయాలి. అందుకే చాలా మంది సివిల్ సర్వెంట్లు.. తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి  ఉద్యోగ విరమణ తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. అతి కొద్ది మంది మాత్రం సర్వీసు ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పొలిటికల్ ఎరీనాలో అడుగుపెట్టిన వారూ ఉన్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది కాలం మాత్రమే రాజకీయాలలో మనగలుగుతున్నారు. రాణించగలుగుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల   బ్యూరోక్రాట్లలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి వ్యక్తిగా    ఎవీఎస్ రెడ్డి పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. డిఫెన్స్ లో పని చేస్తూ, ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏవీఎస్ రెడ్డి భారతదేశం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగుపెట్టారు.  సర్వీసులో ఉండగానే  ఆయన తన పొలిటికల్ పార్టీని  ప్రకటించడం అప్పట్లో ఆందరినీ విస్మయానికి గురి చేసింది.  అయితే ఉద్యోగానికి విరామం ప్రకటించి  పార్టీని  ప్రకటించిన ఏవీఎస్ రెడ్డి రాజకీయాలు తనకు సరికావని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి తిరగి ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యే వరకూ అందులోనే కొనసాగారు. ఇక ఆ తరువాత డాక్టర్ జయప్రకాశ్  నారాయణ్,  వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఇలా పలువురు బ్యూరోక్రాట్లు పాలిటిక్స్ లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కుంటున్నారు.  

వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ తరఫున 2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  విజయ సాధించారు.  వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు నియోజవర్గం నుండి,  ఆ తరువాత  గూడూరు అసెంబ్లీ నుండి చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించారు. అలాగే  రావెల కిషోర్ బాబు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేయగా, ఆదిమూలం సురేష్ కూడా మంత్రిగా చేశారు. అలాగే  తోట చంద్రశేఖర్ , ప్రవీణ్ కుమార్ లు కూడా  బ్యూరోక్రాట్ ల నుంచి పొలిటీషియన్ అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 

రాజకీయాలను దగ్గరగా చూసిన అనుభవంతో, ఈ వ్యవస్థను మార్చాలన్న ఆవేశం బ్యూరోక్రాట్ లు రాజకీయాలవైపు మళ్లడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ తదననంతరం ఫక్తు రాజకీయ పార్టీగా మారడమే రాజకీయమని విశ్లేషకుల వాదన. తీరా రాజకీయాలోకి వచ్చిన తరువాత ఇక్కడి పరిస్థితిని అర్ధం చేసుకుని, నిజాలు నిలకడగా తెలిశాక ఏమి చేయాలో పాలుపోని స్థితిలో బ్యూరోక్రాట్ లు ఉన్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రాజకీయాలలో మనుగడ సాగించడానికి కావలసిన వనరుల సేకరణలో బ్యూరోక్రాట్లు విఫలం అవుతున్నారు. రాజకీయ నాయకులకు ఉండే జనాకర్షణ, ప్రజలలో మమేకమయ్యే అలవాటు ఐఏఎస్ లకు ఉండక పోవడం కూడా వారు రాజకీయాలలో రాణించలేకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు.  ఇలా ఉంటే ఐఆర్ఎస్ అధికారిగా పని చేస్తూ ఆప్ అనే రాజకీయపార్టీని స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ దేశంలో బలమైన రాజకీయశక్తిగా ఎదిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయనా వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదొర్కొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ తరువాత ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.  ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది బ్యూరోక్రాట్లు రాజకీయాలను రిటైర్మెంట్ అనంతర వ్యవహారంగా రాజకీయాలను చూడటం వల్ల వారికి ప్రజలలో పెద్దగా గుర్తింపు రాలేదు అది వేరే సంగతి కేవలం రిటైర్ మెంట్ బెనిఫిట్ గా రాజకీయాలను చూడడంతో మన బాబులకు భవిష్యత్ ఉండటం లేదు. 

  ఇక విధినిర్వహణలో నిజాయితీ పరుడైన అధికారిగా గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా నిజాయితీకి ప్రతిఫలంగా ట్రాన్స్ ఫర్లు వస్తుండటంతో ప్రజా సేవే బెటర్ అని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దూకేశారు. జనసేన పార్టీలో చేరి,  2019లో విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసి సొంతంగా జై భారత్ పేరుతో పార్టీ పెట్టారు. జనసేనాని సినిమాలలో నటించడాన్ని కారణంగా చూపుతూ.. పవన్ కల్యాణ్ ని సీరియస్ పొలిటీషియన్ కాదని భావించి బయటకు వస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. సరే సొంతంగా  జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. అది కూడా బిగ్ ఫెయిల్యూర్ గా మారింది. దీంతో రాజకీయాలు తన వంటికి సరిపడవని గ్రహించిన జేడీ ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరిపోయారు. అయితే.. గతంలో జనసేనానిని సీరియస్ పొలిటీషియన్ అని విమర్శించిన లక్ష్మీనారాయణను ఇప్పుడు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా పాలిటిక్స్ లోకి వచ్చిన బ్యూరోక్రాట్ లు పెద్దగా రాణించలేదనే చెప్పాల్సి ఉంటుంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.