పన్నెండేళ్ల పసివాణ్ని చంపడానికి దాదాపు 10 మంది ఒక్కటయ్యారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారనుకోండి. అది వేరే విషయం. కానీ అంతటి పసివాణ్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో ఎవరూ ఊహించలేకపోయారు. కామారెడ్డి జిల్లాలో అభం శుభం ఎరుగని 12 ఏళ్ల బాలుణ్ని దారుణంగా హత్య చేశారు దుండగులు. పొలంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్యను పోలీసులు సవాలుగా తీసుకున్నారు. హత్యా స్థలంలో దొరికిన ఆనవాళ్ల సాయంతో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నాగిరెడ్డి పేట మండలం మాటూరు మాసంపల్లి శివారులో 12 ఏళ్ల సురేశ్ అనే అబ్బాయిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. బాలుడి ఒంటిమీద ఉన్న గాయాల్ని బట్టి చిత్రవధ చేసి చంపినట్టు అర్థమవుతోంది. బండరాళ్లతో మోది, బలవంతంగా ప్రాణాలు తీశారు.
అక్కంపల్లి గ్రామానికి చెందిన రాములు-సాయవ్వ దంపతుల కుమారుడత సురేష్. ఉపాధి కోసం వారు ఆర్మూర్ కు వలస పోగా... కుమారుడు సురేశ్ ను నానమ్మ పోశవ్వ వద్ద వదిలివెళ్లారు. కొంత కాలంగా నానమ్మ వద్ద ఉంటున్న సురేష్... ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి పందుల వేట కోసం వెళ్ళాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. పిల్లలు బయటికి వెళ్లిన తరువాత మాసం పల్లి శివారులోని గండి వద్ద పొలంలో.. రక్తపు మడుగులో సురేష్ పడి ఉన్నట్టు కబురు అందడం కలకలం సృష్టించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్వ్కాడ్ ను ఉపయోగించి దర్యాప్తు చేశారు. ఫలితంగా పోలీసులు 9 మందిని ఇప్పటికి అరెస్టు చేశారు.
ఇక మృతుని తండ్రి రాములుకు ఇతరులతో ఉన్న పాతకక్ష్యలతోనే సురేష్ ను దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. తండ్రి రాములు చెబుతున్నది కూడా సరిగ్గా సరిపోలుతోంది. తనతో ఉన్న వ్యక్తిగత కక్షలు, భూ తగాదాల కారణంగా వారే కుమారుణ్ని చంపి ఉంటారని తండ్రి అనుమానిస్తుండడంతో విషంలో క్లారిటీ వచ్చింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో నిందితులను తక్కువ సమయంలోనే పట్టుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brutal-murder-of-12-year-old-boy-39-131381.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.