జూన్ 12న బిజెపి యేతర పార్టీలు పెట్టబోయే మీటింగ్ లో బీఆర్ఎస్ గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి బిజెపి ప్రభుత్వం ఆహ్వానించకుండా రాష్ట్రపతిని అవమానించినట్లు ప్రతి పక్షాలు ఆరోపించాయి.
ప్రతి పక్షాలు చేసిన నిరసన కార్యక్రమాల్లో కెసీఆర్ పాల్గొనలేదు. కూతురు కవిత ఢిల్లీ మద్యం కేసులో చిక్కుకుపోవడంతో కెసీఆర్ తన స్ట్రాటజీ మార్చినట్లు కనబడుతోంది. బిజెపితో మెతక వైఖరి కనిపిస్తోంది. ఇరు పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతి పక్షాలు కూడా కెసీఆర్ ను కలుపుకోవడం లేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ కోసం కెసీఆర్ కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరిగారు. ప్రతి పక్షాలను ఏకం చేసే కార్యక్రమాలు భుజాన వేసుకున్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కేవలం కాంగ్రెస్ కు మాత్రమే కెసీఆర్ వ్యతిరేకి. బిజెపితో కేసీఆర్ కు శత్రుత్వం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ బిజెపిని కాకుండా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ప్రతి పక్ష కూటమి జూన్ 12న బీహార్ పాట్నాలో సమావేశమవుతుంది. కాంగ్రెస్ గొడుగు క్రింద కెసీఆర్ ఉండటం ఇష్టం లేక ఈ కూటమిలో కలవడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోఆర్డినేషన్ లో ఈ కూటమి సమావేశమవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో ఉన్నారు. 12 సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. బిజెపి ప్రభుత్వాన్ని తూర్పార బట్టడానికి కూటమి సమావేశాలను ఇక నుంచి వరుసగా నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-not-attending-opposition-meeting-39-156241.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!