నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష..?... మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్..!

Publish Date:Sep 2, 2026

Advertisement

 

నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!

తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..!

ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు.

నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు.

ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు.

మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“

నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. 

“ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.

 

Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.