విశాఖ స్టీల్ బిడ్డింగ్ పైహైప్ క్రియోట్ చేసి ఉస్సురుమనిపించారు!

Publish Date:Apr 21, 2023

Advertisement

బీఆర్ఎస్ విశాఖ ఉక్కుబాగోతం బట్టబయలైంది. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)బిడ్ దాఖలు చేస్తాం, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానీయం, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది.. అంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పించి, డాంబికాలు పలికిన బీఆర్ఎస్ చేతులెత్తేసింది.

విశాఖ స్టీల్‌ ఈవోఐ బిడ్లలో తెలంగాణ సర్కారు పాల్గొని, విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఆపుతుందని.. బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన హడావిడి, హుటాహుటిన సింగరేణి యాజమాన్యాన్ని విశాఖకు పంపించి, స్టీల్ ఫ్యాక్టరీని పరిశీలించమని ఆదేశించి, బిడ్డింగ్ వివరాలపై ఆరా తీయించిన కేసీఆర్ సర్కార్.. తమకంత సీన్ లేదని చతికిలపడిపోయింది. బిడ్ వేసి విశాఖ స్టీల్ ను గంపగుత్తగా తాము అధీనంలోకి తెచ్చేసుంటామన్నంత బిల్డప్ ఇచ్చిన కేసీఆర్  తాము బిడ్ వేయడానికి గడువు కావాలంటూ కోరింది. నిజమేకాబోలని  స్టీల్‌ యాజమాన్యం ఐదు రోజులు గడువు పొడిగించింది. ఆ గడువు ముగిసిపోయింది.. అయినా  సింగరేణి యాజమాన్యం బిడ్ దాఖలు చేయలేదు. తమకసలా ఉద్దేశమే లేదన్నట్లుగా గమ్మునుండిపోయింది.   దాంతో  విశాఖ స్టీల్‌ యాజమాన్యం తన పని తాను చేసుకుపోయింది.

విశాఖ స్టీల్‌ను  ప్రైవేటీకరణ నుంచి కాపాడేస్తున్నామంటూ తెగ హంగామా చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు నోరెత్తడం లేదు. విశాఖ స్టీల్‌ను ఆదుకుంటున్న కేసీఆర్‌ను, విశాఖకు తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారంటూ.. గొప్పలు చెప్పిన ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ముఖం చాటేశారు.  బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణమేమిటో కూడా చెప్పేందుకు సింగరేణి యాజమాన్యానికి కానీ, బీఆర్ఎస్ నాయకత్వానికి కానీ కనీసం ముఖం చెల్లలేదు.  అయితే విశాఖ స్టీల్ విషయంలో కేసీఆర్ కుప్పిగంతులు ఆయనకు రాజకీయంగా కావలసినంత నష్టం చేకూర్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విశాఖ స్టీల్‌ బిడ్డింగ్‌లో పాల్గొని, అందులో పెట్టుబడి పెట్టడమో, లేక సరుకు సరఫరా చేయడం ద్వారా.. బీఆర్‌ఎస్‌ ఆంధ్ర ప్రజలకు దగ్గరవుతుందన్న అంచనాలు మంత్రుల ప్రకటనలు, సింగరేణి అధికారుల విశాఖ పర్యటన, ఏపీ బీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహం వల్ల భారీగా పెరిగాయి.   చివరికి బిడ్డింగ్ లో పాల్గొనకుండా పలాయనం చిత్తగించడంతో  ఏ రాజకీయ మైలేజీ కోసమైతే బీఆర్ఎస్ ఇంత హడావుడి చేసిందో.. అది దక్క లేదు సరికదా, రాజకీయంగా ప్రతిష్ట మసకబారింది. విపక్షాలు బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా సమాధానం చెప్పుకోలేని, కౌంటర్ ఇవ్యలేని దుస్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది.  

కేసీఆర్ విశాఖ స్టీల్ బిడ్ ప్రస్తావన తేగానే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ సర్కార్ కానీ, సింగరేణి యాజమాన్యం కానీ 5 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తుంది? ఇదంతా కేసీఆర్‌ పబ్లిసిటీ స్టంట్‌. తాదూర కంత లేదు కానీ మెడకో డోలన్నట్లు.. ఇక్కడ మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే దిక్కులేదు కానీ ఆంధ్రాకు వెళ్లి ఏం చేస్తారంటూ బీజేపీ-కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.   ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు వాటిని అప్పట్లో ఖండించారు. తీరా విపక్షాలు విమర్శించినట్లుగానే   తెలంగాణ సర్కారు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా  ముఖం చాటేయడంతో బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధిని, ప్రచారపటోపం తప్ప మరేం కాదన్న విషయం ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది.

బీజేపీ-కాంగ్రెస్‌ విమర్శలు నిజమని  తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అసలు విశాఖ స్టీల్‌ వ్యవహారంలో తలదూర్చడమే వ్యూహాత్మక తప్పిదమని, సింగరేణికి అంత ఆర్ధిక స్తోమత లేదని తెలిసికూడా సాహసం చేసి, చేతులు కాల్చుకున్నామని బీఆర్‌ఎస్‌ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక ఇప్పుడు పట్టుకుందామన్నా ఆకులు దొరికే పరిస్థితి  లేదనీ, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ అంటున్నారు. ఈ అనవసర తప్పిదం వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా మసకబారిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. పరిశీలకులూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.