జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ ఆహ్వానం?

Publish Date:Dec 14, 2022

Advertisement

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జేడీ లక్ష్మీనారాయణకు పరిచయం అవసరం లేదు. సిబిఐలో ఆయన హోదా (జేడీ)నే ఇంటి పేరుగా మార్చుకున్నఆయన అసలు పేరు, వీవీ లక్ష్మి నారాయణ, వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ. ఆ పేరుతో ఆయన్ని ఎవరూ గుర్తుపట్టక పోవచ్చును కానీ, జేడీ అంటే చాలు, లక్ష్మీనారాయణ కళ్ళ ముందు కనిపిస్తారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జేడీ లక్ష్మినారాయణ వార్తల్లో వ్యక్తిగా, మీడియలో తరచు కనిపిస్తూనే ఉన్నారు. అయితే    ఇప్పడు ఇక్కడ ఆయన ప్రస్తావనకు  ఆయన సిబిఐ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం లేదు. అయితే  అందుకో కారణం వుంది. నో .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సిబిఐ విచారణ ఎదుర్కుంటున్న  తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కుమార్తె  తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కేసు గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు  విశ్లేషణలు, ఇక్కడ ఆయన ప్రస్తావనకు కారణం కాదు. 

నిజానికి ఆయన పూర్వాశ్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అయినా సిబిఐ వాసనలు ఆయనను వదలక పోయినా, ఆయన ప్రస్తుతం  ఒక పొలిటీషియన్. రాజకీయ వేత్త. ఆరేడేళ్ళ కిందట స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. జనసేన పార్టీలో చేరారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం  నుంచి పోటీ చేశారు. ఓడి పోయారు.ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. అయితే అయిన రాజకీయాలను వదిలేయలేదు. మరో పార్టీలో చేరలేదు కానీ రాజకీయాలో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అంతే కాదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి మళ్లీ పోటీ చేస్తానని.. ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఇప్పడు అదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో  హాట్ టాపిక్. జేడీ ఏ పార్టీలో చేరతారు అనే విషయం  కట్టప్పను ఎవరు చంపారు  స్థాయిలో టెన్షన్  క్రియేట్ చేస్తోందని అంటున్నారు. 

మరో వంక చాలా కాలంగా జేడీ రాజీకీయ భవిష్యత్ ప్రస్థానం గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు బీజేపీలో చేరతారని అంటుంటే.. మరికొందరు వైసీపీలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇంకొందరు టీడీపీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తున్నారు. మరోవంక మాజీ జేడి అమ్ ఆద్మీ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే అదలా ఉంటే  గత నాలుగైదు రోజులుగా జేడీ లక్ష్మినారాయణ రాజకీయ ప్రస్థానం గురించి మరో  బ్రేకింగ్ న్యూస్ వినవస్తోంది.  అవును జేడీ లక్ష్మినారాయణను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న పార్టీలలో మరో పార్టీ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా జాతీయ రాజకీయ యవనిక పై తెలంగాణ జెండా ఎగరేసే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చుకున్న  తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల ‘జాతీయ’ పార్టీ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారాస ఏపీ బాధ్యతలు చూస్తున్నట్లు చెపుతున్న  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్  మాజీ జేడీతో సంప్రదింపులు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే  తలసాని జేడీతో కలవాలని అనుకుంటోంది, అందుకోసంగా ఆయనను ఫోనులో సంప్రదించింది నిజమే అయినా ఆయనని పార్టీలోకి ఆహ్వానించేందుకు కలవాలనుకుంటున్నారా  లేక కవిత కేసులో సలహాలు తీసుకునేందుకు కలవాలని అనుకుంటున్నారా? అనేది స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. నిజానికి, ఈ అనుమానంతోనే కావచ్చును జేడీ లక్షినారాయణ  ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఇంకా ఒక ఆలోచనకు రాలేదని  సున్నితంగా తలసానికి నో .. చెప్పినట్లు తెలుస్తోంది. 

అదలా ఉంటే, ఇంతవరకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ పై అంతగా దృష్టి పెట్టని  కేసీఆర్  ఇప్పడు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టిని  కేంద్రీకరించారని  ఏపీలో ముఖ్యంగా కాపు వర్గం పై దృష్టి పెట్టారని  అంటున్నారు. అందులో భాగంగానే  యాదవ్ సామాజిక వర్గానికి చెందిన  మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కోడి పందేల బంధుత్వాలు, టీడీపీ రాజకీయ చుట్టరికాలు ఉన్న తలసాని శ్రీనివాస రావుకు ఏపీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికకి చెందిన జేడీ లక్ష్మీనారాయణతో సంప్రదింపులు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. అయితే  ఈసారి ఎలగైనా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని గట్టిగా భావిస్తు జేడీ లక్ష్మీనారాయణ అసలు  ఏ పార్టీలోనూ చేరక పోవచ్చని  చివరకు ఒక జాతీయ పార్టీ ప్రత్యక్ష, మరో ప్రాంతీయ పార్టీ పరోక్ష మద్దతుతో విశాఖ నుంచి ఇండిపెండెంట్  గా పోటీ చేసే ఆలోచన నడుస్తోందని అంటున్నారు.

నిజానికి  స్వయంగా జేడీ లక్ష్మినారాయణ కూడా  ఒక ఇంటర్వ్యూలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం లేకపోలేదని సూచన ప్రాయంగా చెప్పారు.  కర్ణాటకలో సినీనటి సుమలత అంబరీష్ ఎంచుకున్న మార్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తే అందరి  మద్దతు పొందే అవకాశం ఉంటుందని ఆయన అత్యత సన్నిహిత మిత్రులు అంటున్నారు.  సో .. జేడీ భారాస లో  చేరతారా, లేదా, అనేది ఇప్పట్లో తేలే విషయం కాదు. సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందనే అనుకోవచ్చును.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.