జగన్ కు బీఆర్ఎస్ బిగ్ షాక్!?

Publish Date:Jan 9, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిఆర్ఎస్ బిగ్ షాక్  ఇచ్చిందా? రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ అంటూ వెల్ కం చెప్పినా.. బీఆర్ఎస్ వైసీపీకి భారీ నష్టం చేకూరే స్టాండ్ తీసుకుందా అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  ఏపీ నుంచి చేరికలతో రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకలాపాలు  జోరందుకున్నాయి. ఏపీలో ఆ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్  తమ పార్టీ ఉద్దేశాలు, విధానాలు, లక్ష్యాలన వెల్లడించారు.

ఆయన వెల్లడించిన అంశాలు వైసీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారాయి.   రాష్ట్రంలో మూడు రాజధాను వివాదంపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటన్నది  చంద్రశేఖర్ తేటతెల్లం చేశారు.  ఒక టీవీ ఇంటర్వ్యూలో చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తోట చంద్రశేఖర్ ప్రజాభీష్టాన్నేతాము శిరసావహిస్తామని చెబుతూ..  ప్రజల్లో అధిక శాతం మంది అమరావతిలోనే రాజధాని ఉండాలనుకుం టున్నారని, తమ పార్టీ ది కూడా అదే అభిప్రాయం అని స్పష్టం చేశారు. అమరావతికే బిఆర్ఎస్ మద్దతని కుండబద్దలుకొట్టినట్టు  బహిరంగంగా చెప్పారంటే, అధి  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్దేశమేనని వేరే చెప్పనవసరం లేదు.  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. మొదటి నుంచి ఇద్దరూ పరస్పర సహాకార ధోరణినే అవలంబిస్తున్నారు.  అయితే   రాజధాని విషయంలో మాత్రం అమరావతికే బిఆర్ఎస్ మొగ్గు చూపడంతో వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని విస్పష్టంగా తేలిపోయింది.

ఏపీలోకి అడుగుసెట్టిన భారత రాష్ట్ర సమితి లక్ష్యం తెలుగుదేశం, జనసేన ఓట్లు చీల్చి వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయడమేనన్న ప్రచారం  ఇప్పటికే రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, జనసేనతోపాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ.. తదితర పార్టీలన్నీ అమరావతి రాజధానికే మద్దతు పలుకుతున్నాయి. వైసీపీ మాత్రం కర్నూలు, విశాఖ, అమరావతి అంటూ మూడు రాజధానుల పాట పాడుతోంది.   దీనిపై ఆ పార్టీకి రాజకీయ పార్టీల నుంచే కాదు, ప్రల నుంచి కూడా ఎటువంటి మద్దతూ లభించ లేదు.   రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్యా పలు సమస్యలు ఇప్పటికీ అపరిష్కృ తంగానే ఉన్నాయి.  

 ఏపీకి కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాకానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు.. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు.. లాంటివన్నింటిపై కేసీఆర్ అభిప్రాయం ఏమిటనేది స్పష్టత రావడంలేదు. తెలంగాణ వైపు నుంచి చూస్తే ఈ ప్రాజెక్టులన్నీ వస్తే తెలంగాణ కన్నా ఏపీ ముందు వరుసలో నిలబడటానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా జాతీయ పార్టీ నేతగా చూస్తే ఒక రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. మూడు రాజధానులపై తన విధానాన్ని ప్రకటించిన బీఆర్ఎస్ మిగిలిన అంశాలపై ఏ స్టాండ్ తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.