తెలుగుదేశంలోకి బొత్స కుటుంబం?.. వైసీపీకి భారీ షాక్

Publish Date:Aug 14, 2023

Advertisement

ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో.. ఎవరు ఎప్పుడు గోడ దూకేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే  కాస్త ముందో వెనకో ఊహాగానాలు మాత్రం బయటపడతాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీపై అసంతృప్తి ఎక్కువగా ఉంటే ఈ వలసలు భారీ స్థాయిలో ఉంటాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీది కూడా అదే పరిస్థితి. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగా ఇప్పటి నుండే వైసీపీ నుండి మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటున్నారు.

సమయం సందర్భం చూసుకొని ఒక్కొక్కరు తెలుగుదేశం దారి పడుతున్నారు. అటు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు.. ఉత్తర కోస్తా నుండి దక్షణ కోస్తా వరకూ అన్ని జిల్లాలో ఈ వలసల పరంపర మొదలయ్యే అవకాశం  ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. వైసీపీ నుండి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు మొత్తం 40 నుండి 50 మంది పక్క చూపులు చూస్తున్నారని రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యేలు నలుగురూ ఇప్పటికే టీడీపీ గూటికి చేరుతారన్నది ఖరారైపోగా, మరో ఆరుగురు వైసీపీ నేతలు ఈ నెలలోనే గోడ దూకేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 ఏదో సీదా ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గాలను దాటి రాష్ట్ర ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఎమ్మెల్యేలే కాకుండా,  రాష్ట్రస్థాయి నేతలు, మాజీ మంత్రులు, సీనియర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వినిపిస్తున్నది. ఉత్తరాంధ్ర నుండి చూస్తే ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో ఎక్కడా బయటకి రావడం లేదు. అవంతికి సన్నిహితుడైన పంచకర్ల రమేష్ విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అన్న ఆసక్తి మొదలైంది. రమేష్ ఒక్కరే కాదు అవంతి కూడా పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.

విశాఖకు పరిపాలన రాజధాని తీసుకొస్తామని మూడేళ్లుగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తీవ్ర ప్రచారం చేశారు. రాజధాని సంగతేమో కానీ.. విశాఖలో రౌడీయిజం పెరిగి శాంతి భద్రతలు దెబ్బతిన్నట్లు అక్కడి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఈసారి వైసీపీకి ఎదురుగాలి తప్పదని ప్రచారం జరుగుతున్నది. అందుకే ఇక్కడి నేతలు  ప్రజల మూడ్ ని బట్టి వైసీపీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కాగా ఉత్తరాంధ్రలో వైసీపీ అతి పెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం. బొత్స సొంత కుటుంబంతో పాటు ఆయన సామాజిక వర్గం తూర్పు కాపు నేతలకు ఇక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేతలలో చాలా మంది బొత్స కుటుంబానికి బంధువులు, సన్నిహితులు. అందుకే బొత్స కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేసినా మళ్ళీ తనని వైసీపీలో చేర్చుకొని సముచిత స్థానం కల్పించారు. అయితే  ఇప్పుడు ఈ బొత్స అండ్ కో తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ సహా వైసీపీకి చెందిన యాభై మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఒక బాంబు పేల్చారు. దీంతో సహజంగానే బోండా వ్యాఖ్యలలో వాస్తవాలు ఎంత అని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

బొత్స ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నారు. మరో బంధువు, బడికొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్ల నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే, అదే నెల్లిమర్లలో బొత్స తమ్ముడు లక్ష్మణరావు కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఎస్ కోటలో ఉన్న బొత్స సన్నిహిత బంధువు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీగా ఉన్న బొత్స మరో బంధువు బెల్లాన చంద్రశేఖర్ ఇలా బొత్సకు బంధువులే అరడజను మంది ఉండగా తన సన్నిహితుల జాబితా కూడా మరో అరడజను ఉంది. బెల్లాన చంద్రశేఖర్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆరాటపడుతుండగా వైసీపీ నుండి ఇంకా హామీ దొరకలేదు. బడికొండ అప్పలనాయుడు, బొత్స తమ్ముడు లక్ష్మణరావులలో ఒకరికే వైసీపీ నుండి టికెట్ దక్కుతుందని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిందంటున్నారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు టీడీపీతో టచ్ లో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇక మజ్జీ శ్రీనుకు టికెట్ ఇస్తారా? ఎస్ కోట శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్నది కూడా అనుమానమే. ఇవన్నీ లెక్కలేసుకొనే టీడీపీ నేతలు బొత్స కుటుంబాన్ని ఆకర్షించే పని పెట్టుకున్నారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగి వీరంతా టీడీపీలోకి మారితే ఇటు బొత్సకు, అటు వైసీపీకి భారీ నష్టం తప్పదు.

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.