సరదాగా.. బొత్స బాబుకు కొట్టాల్సిందే చప్పట్లు...

Publish Date:Dec 28, 2021

Advertisement

బొత్స సత్యనారాయణ ఉరఫ్ సత్తి బాబు తెలుసు కదా.. తెలియకుండా ఎందుకుంటారు.. ఆయన పరిచయం అవసంరం లేని పొలిటీషియన్. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో  మంత్రి. అదికూడా అలాంటి .. ఇలాంటి మంత్రి కాదు... సీనియర్ మినిస్టర్. అంతోటి అయన నోటినుంచి ఏదైనా మాట వచ్చిందంటే, అందులో ఎన్నో అర్థాలు, తాత్పర్యాలు ఉంటాయి.

అప్పుడెప్పుడో, ఆయన గారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ కాబినెట్’లో మంత్రిగా ఉన్న రోజులల్లో వోక్సువాగను కార్ల కంపెనీ పట్టుకొస్తామంటే ఓ రూ.11 కోట్లు ప్రజల సొమ్ము వశిష్ట వాహన్ అనే అడ్రసులేని కంపెనీ కిచ్చేశారు. తీరామోసి ఆ సూట్ కేసు కంపెనీ, ఆ సొమ్ములట్టుకుని ఎగిరి పోయింది. అప్పుడు, మన బొత్స బాబు ఏమ్మన్నారు, చాలా సింపుల్’గా, సొమ్ములు పోనాయి అయితే ఏంటంట..అని అసెంబ్లీ సాక్షిగా సెలవీయ లేదు. శ్రీ బొత్స బాబు ఇచ్చిన ఆ సందేశంలో ఎంత విషయముంది.. ఎంత ఇది .. ఎంత అది ఉంది, అందుకే కదా ఇన్నేళ్ళ తర్వాత కూడా ‘సొమ్ములు పోనాయండి’ అన్న శ్రీ బోత్సవారి సందేశం, డామిట్ కథ అడ్డంతిరిగింది న్న గిరీశం డైలాగులా  మనకు గుర్తుండి పోయింది. 

ఆ కథను అక్కడ కట్ చేసి ... ప్రెజంట్ ... ప్రస్తుతంలోకి వస్తే, బొత్స వారు మళ్ళీ ఇంతకాలానికి అంతటి ఆణిముత్యం లాంటి మాట ఒకటి వదిలారు .. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌ పరిపాలన బాగోలేదని గుర్తొచ్చిందా? అని బీజేపీ వాళ్ళను సూటిగా, చాలా స్ట్రెయిట్’ గా ప్రశ్నించారు. నిజమే కదా.. జగన్మోహన్ రెడ్డి పాలన కొత్తగా ఈరోజు చెడిపోయింది ఏముంది? ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచే జగన్ రెడ్డి తానేమిటో .. తన ఒక్క ఛాన్స్ కథేమిటో .. ఎక్కడా ...ఏమాత్రం దాచుకోకుండా, దాపరికం లేకుండా చెపుతూనే ఉన్నారు. చూపిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వస్తూ వస్తూనే ప్రజా వేదికను కూల్చేశారు. ఇక అక్కడి నుంచి అన్నీ కూల్చివేతలే. భవనాలే కాదు వ్యవస్థలను కూల్చి వేస్తూనే  ఉన్నారు. వ్యవస్థలనే కాదు .. దేవుళ్ళను .. దేవాలయాలను ... గుళ్ళూ గోపురాలను కూల్చి వేస్తునే ఉన్నారు.ఆర్థిక వ్యవస్థ విషయం అయితే చెప్పనే అక్కరలేదు .. రాష్ట్రానికి  రాజధాని లేదు కానీ, రాష్ట్ర అప్పులు నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంటున్నారు. ఇవ్వన్నీ కూడా బహిరంగ రహస్యాలే. 

కేంద్ర ప్రభుత్వం ఎప్పుడోనే కళ్ళు తెరవవలసింది. ఎందుకైతే ఏం గానీ కల్లు తెరవలేదు. అందుకే .. ఇప్పుడు శ్రీ సత్తిబాబు గుర్తు చేశారు. జగన్ పాలన, ఇప్పుడేమిటి, మూడేళ్ళుగా ఇలాగే ఇలాగే, ఇంతే సుందర ముదనష్టంగానే సాగింది. అవును   మూడేళ్ళుగా బాగాలేదండి .. ఏటి సేత్తాం .. అని ... చక్కగా ఉత్తరాద్ర యాసలో  అడిగారు.అంతే కాదు ఏదైనా తప్పుటే సెప్పండని కూడా ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్ రెడ్డి అరాచక పాలన చూడమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పకనే చెప్పారు. ఇంత చక్కని నిజాన్ని చక్కగా చెప్పిన బొత్స బాబుకు కొట్టాల్సిందే ...చప్పట్లు. ఏమంటారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.