మీర్ పేట్ లో పేలుడు.. ఒకరి మృతి

Publish Date:Jun 21, 2026

Advertisement

హైదరాబాద్‌  భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని  బడంగ్‌పేట్‌లోని ఓ గోడౌన్ లో  ఆదివారం (జూన్ 21) జరిగింది.  మృతుడిని పశ్చిమ బెంగాల్ కు చెందన అనూప్ ప్రధాన్ గా గుర్తించారు.   కొద్ది రోజుల కిందట కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బతుకు తెరువు కోసం వలస వచ్చినట్లు తెలుస్తోంది. 
 
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు,  రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని  పోలీసులు   అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. ఈ ఘటనలో గోడౌన్ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించాయి. నిపుణుల నివేదిక అందిన తర్వాతే పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించలేదని, ఇతర వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.            

By
en-us Political News

  
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఆదివారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.