వెలిసిపోయిన కమలం!

Publish Date:Oct 27, 2022

Advertisement

పిల్లలు బాగా చదువుతామని తండ్రికి హామీ యిస్తారు, తప్పకుండా గెలపించాలని అభ్యర్ధులు తమ తమప్రాంతంలోని ఓటర్ల నుంచి హామీ తీసుకుంటారు, కానీ కేసులు లేకుండా చేస్తామని హామీ యివ్వడం మాత్రం బీజేపీవారివల్లే అయింది. ఇది కనీ వినీ ఎరుగని హామీ. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో అంశాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.  తమ పార్టీలో చేరండి అన్ని తామే చూసుకుంటామన్న ధీమా వ్యక్తం చేయడం. అందులోనూ వారికి ఎలాంటి క్రిమినల్ నేపథ్యం ఉన్నా తామే చూసుకుంటామనడం. ఇంతకంటే దారుణమైన హామీ ఎవరూ ఇవ్వరు.  అంటే తమ పార్టీ బలపడేందుకు, తమ విజయానికి ఎలాంటి వారినయినా గట్టి పట్టున్నవారని తెలిస్తే లాగేసుకోవడానికి ఇంతటి హామీలను ఇచ్చి అక్కున చేర్చుకోవాలనుకోవడం బీజేపీవారి గొప్ప ఆలోచన. 

ఈమధ్యవరకూ మా పార్టీలో చేరండి మీకు ఏదో ఒక మేలు చేస్తామన్న ధీమా ఇచ్చేవారు. అంటే సామాన్యంగా అనుకు నేది.. ప్రభుత్వ కార్యాలయాల్లో తమవారికి ఉద్యోగాలో, ఏదో  ఒక పథకంలో భాగ స్వామి చేయడమో లేదా ఫ్రాజెక్టు కాంట్రాక్టులు లాంటివే.. కానీ రోజులు మారిపోయాయి. అంతే కోట్ల వ్యవ హారమే. అంతా డబ్బు మయం. కోట్లలో వస్తువుల్ని, భవనాల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేయడం అనేది కేవలం కమలనాథుల బుర్రలోంచి వచ్చిన గొప్ప ఆలోచన. చిత్రమేమంటే ఇది భయానకమనో, ప్రజలు తమ రహస్యం తెలుసుకుంటే, బండారం బయటపడితే పోయేది తమ పరువేనన్న ఆలోచన, భయం లేకుండా ధైర్యంగా రహస్యంగా వ్యవహారం నడిపేయాలనే చూశారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్న అంశాల్నీ భీజేపీ వారి నీతి నిజాయితీని నాలుగు రోడ్ల జంక్షన్లో పెట్టేసిం ది.  నిన్న మొన్నటి వరకూ టీఆర్ ఎస్ పరువు తీయడానికి ఒంటకాలి మీద లేచిన కమలనాథు లంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

తన వ్యూహం తననే ముంచిందనేది బీజేపీవారే రుజువు చేయడం పెద్ద  సినిమా కంటే అతి పెద్ద చిత్రమే చూపింది.  ఎరవేయడం నలుగురిని లాక్కనేందుకు వ్యూహ రచన చేసామని జబ్బలు చరుచు కోవడం, మునుగోడు ఉప ఎన్నిక ముందే టీ ఆర్ ఎస్ కొంపముంచేసేమని ఏసీ గదుల్లో కూచుని హాస్య మాడుకోవడం, గట్టిగా నవ్వుకోవడం అంతా ఆ గదులకే పరిమితమై అసలు రంగు బయటపడింది. కాషాయం బాగా వెలిసిపోయి హేమా హేమీ నాయకుల బుర్ర తక్కువ తనం ఆసేతు హిమాచలమూ తెలిసిపోయింది.  ఇక తమ పరువును తామే కాపాడుకోవాల్సిన పెద్ద పనిలో పడాల్సిన అగత్యం ఏర్పడిం ది. అధికారంలోకి రావడానికి వేసే వలలు టీ ఆర్ ఎస్ వ్యూహంతో ముక్కలయ్యాయి. చేపలు అను కున్నవారు చేపలు కాదని తమకు భవిష్యత్ అగమ్యగోచరం చేయగల టీ ఆర్ ఎస్ వీరాభిమాను లేనని తేటతెల్లమయింది.  ఇపుడు తెలంగాణా అంతా తమదే నని రొమ్ము విరుచుకు ప్రచారం చేసుకుంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కేంద్రంలోని వారి మహా నేతలకు మొహం ఎలా చూపగలరో మరి. వ్యూహానికి, అమలుకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందునా టీ ఆర్ ఎస్ వీరాభిమానులను అంత సులువుగా చేపల్లా లాగేసుకునే ఆలోచన బీజేపీ వారికి పెద్ద బూమరాంగ్ అయింది.  ఇక తెలంగాణ  బీజేపీ మహానేతలు దేశ  తెలంగాణా ప్రజలకు, తమని నమ్ముకుని జండా పట్టుకు తిరుగుతున్నవారికీ సమాధానం చెప్పుకోవాలి. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.