తెలుగుదేశం, జనసేన కూటమితోనే కమలం.. బాబు, పవన్ ఆమోదించిన వారికే బీజేపీ టికెట్లు!

Publish Date:Mar 8, 2024

Advertisement

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్  అమిత్‌షాతో , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారు. వీరి భేటీతో టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరిక ఖరారైంది. సీట్ల సర్దుబాటు కూడా ఖరారైందని అంటున్నారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రాథమిక సమాచారం మేరకు  బీజేపీకి 5ఎంపీ, 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు బీజేపీ వర్గాల సమాచారం. అయితే గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని, లేకపోతే వైసీపీ లబ్ధి పొందుతుందన్న బాబు సూచనతో అమిత్ షా, నడ్డాలు ఏకీభవించినట్లు చెబుతున్నారు.  అలాగే తెలుగుదేశం, జనసేన ఓటు బదిలీ అయ్యే అభ్యర్ధులనే  బీజేపీ బరిలోకి దింపే విధంగా కూడా అమిత్ షా, నడ్డాలు బాబుకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.  మొదటి నుంచీ తెలుగుదేశంను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకు సీట్లు ఇచ్చినా, అక్కడ ఓటు బదిలీ కాకపోతే ఉభయులకూ నష్టమని, అలా నష్టం చేకూర్చే విధంగా తమ అభ్యర్థుల ఎంపిక ఉండదనీ అమిత్ షా, నడ్డాలు విస్పష్టంగా చెప్పినట్లు బీజేపీ వర్గాల నుంచే తెలుస్తోంది. దంతో పొత్తులో బాగంగా బీజేపీకి  సీట్లు దక్కినా,  అది ఏ విధంగానూ ప్రత్యక్షంగానైనా,  పరోక్షంగానైనా  వైసీపీకి ప్రయోజనం చేకూరేలా ఉండకుండా క్షేత్రస్థాయి పరిస్థితులుపై అభ్యర్థుల ఎంపిక ఉండాలన్న విషయంలో తెలుగుదేశం, జనసేన కూటమి షరతును షా, నడ్డా అంగీకరించినట్లు చెబుతున్నారు.

 ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు పొత్తులో భాగంగా బీజేపీ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, అరకు, హిందూపురం, తిరుపతి పార్లమెంటు స్థానాలలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే  పురందేశ్వరి, సత్యకుమార్, సుజనాచౌదరి, రఘురామకృష్ణంరాజు, గీత   పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు హిందూపురం కాకపోతే, రాజంపేట, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి   విజయవాడ లేదా ఏలూరు, పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అలాగే అరకు ఎంపీగా   గీత పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు  బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు.  ఇక అసెంబ్లీలో 9 చోట్లా కూడా బీజేపీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేన  అధినేతలు బీజేపీ అగ్రనేతలకు విస్పష్టంగా చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.