15న వైఎస్ వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటన?

Publish Date:Mar 8, 2024

Advertisement

వచ్చే ఎన్నికలలో డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం ఇప్పటికే ఖరారైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 15న వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి. ఆయన వర్ధంతి సందర్భంగా డాక్టర్ సునీత రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందు కోసం పులివెందులలో  పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమె ప్రయత్నాలకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమం కోసం డాక్టర్ సునీత ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే దానిని వైసీపీ నేతలు క్యాన్సిల్ చేయించేశారని అంటున్నారు.

దీంతో పులివెందులలో ఆయితే తమను ఏదో విధంగా అడ్డుకుంటారన్న నిర్ణయానికి వచ్చేసిన ఆమె వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమాన్ని కడపకు మార్చారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన క్లియర్ కట్ మెసేజ్ ను ఇప్పటికే ఇచ్చేశారు. హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన అన్న జగన్ కు, ఆయన పార్టీకీ ఓటు వేయవద్దని విజ్ణప్తి చేశారు. తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం కూడా త్వరలో ప్రకటిస్తామని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆ ప్రకటనకు సమాయత్తమౌతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో కడపలో రాజకీయం ఆసక్తికరంగా మారనున్నది. వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబీకుల మధ్యే పోరు జరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్య కడప లోక్ సభ బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా, ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులకు శిక్షపడకుండా జగన్ తన అధికారాన్నంతా ఉపయోగించి అడ్డుకుంటున్నారని ఆమె ఎటువంటి మొహమాటాలూ, బేషజాలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ పాలనలో ఏపీలో రాక్షసరాజ్యం నడుస్తోందనీ, అందరికీ సమాన న్యాయం అన్న పరిస్థితి లేదనీ సునీత హస్తినలో మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా తన తండ్రి హత్య కేసులో దోషులను కాపాడటానికి జగన్ ప్రయత్నిస్తున్నారనీ, అధికారం ఉండటంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, న్యాయం కోసం తన న్యాయపోరాటం కొనసాగుతుందని చెబుతూనే, రాజకీయంగా కూడా జగన్ తో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్పారు.

ఈ పోరాటంతో తనకు ప్రజా దీవెనలు, మద్దతు కావాలని విజ్ణప్తి చేశారు. ఇందు కోసం ప్రజలలోకి వెడతాననీ స్పష్టం చేశారు. దీంతో వైఎస్ వివేకా కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి నిలబడటం ఖాయమైందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. ఇక పోటీ చేయడమంటూ వస్తే ఎక్కడ నుంచి ఎవరు అన్న విషయంలో  ఇంకా క్లారిటీ రాలేదు. డాక్టర్ సునీత పోటీ చేస్తారా? లేక ఆమె తల్లి, దివంగత వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగుతారా అన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒక వైపు చేస్తున్నపోరాటానికి మద్దతుగా సునీత కాంగ్రెస్ గూటికి చేరి కడప లోక్ సభ బరిలో దిగే అవకాశాలున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది.

అదే విధంగా డాక్టర్ సునీత కాదు, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కడప లోక్ సభ బరిలో నిలబడే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఈ అభిప్రాయాలు ఇలా ఉండగా మరో కొత్త చర్చ ఇటీవల తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగితే జగన్ అండ్ కో దాష్టీకాల నుంచి రక్షణ ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. ఆ అభిప్రాయం ప్రకారం డాక్టర్ సునీత,  సౌభాగ్యమ్మలు తెలుగుదేశం పార్టీలో చేరి ఇరువురిలో ఎవరో ఒకరు కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగుతారు. అదే కనుక జరిగితే అక్కడి సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి ఎదురీత తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల పోటీ ప్రభావం ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా బలంగా ఉంటుందని, దీంతో జగన్ కు సొంత జిల్లాలోనే గెలుపు ధీమా సడలిపోతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సారి ఎన్నికలలో కడప జిల్లాలో ఫలితం ఏకపక్షంగా ఉండే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.