మునుగోడు ప్రేమలో బీజేపీ, టిఆర్ ఎస్‌

Publish Date:Jul 25, 2022

Advertisement

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం మీద‌  అంద‌రి దృష్టీ ప‌డింది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆయ‌న కూడా బిజెపీ హేమాహేమీల‌తో సంప్ర‌దించాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అంగీక‌రించ‌డంతో ఆయ‌న అతి త్వ‌ర‌లో కాంగ్రెస్‌కు టాటా చెప్ప‌డం ఖాయ‌మ‌నే భావన అందిరిలో వ్యక్తమౌతోంది. ఈ కార‌ణంగా ఇక్క‌డ ఉప ఎన్నిక‌ అనివార్యమన్న భావనతో అందరి దృష్టీ ఇప్పుడు మునుగోడుపై పడింది

కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుని చాలాకాలం నుంచీ ఆ పార్టీలోనే ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి. తెలంగాణా ఏర్ప‌డిన‌పుడు  అందలం ఎక్కిస్తారని  ఆశించారు. కానీ అది జరగలేదు. పుండు మీద కారం జల్లినట్లుగా టీపీసీపీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో ఆ పదవి ఆశించి భంగపడ్డ తనసోదరుడు కోమటి రెడ్డి కంటే రాజగోపాలరెడ్డికే ఎక్కువ ఆగ్రహం వచ్చింది.  పదే పదే తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన రాజగోపాల రెడ్డి కారణాలేమైతేనేం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇందు కోసం ఆయన బీజేపీ విధించిన షరతును అంగీకరించేందుకు కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది.  మునుగోడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే పార్టీ సభ్యత్వం ఇస్తామనీ, రాజీనామా వల్ల ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో ఆయనను బీజేపీ టికెట్ పై గెలిపించుకుంటామనీ బీజేపీ పెద్దలు ఆయనకు చెప్పినట్లు సమాచారం.  తెలంగాణాలో పాగావేయాలంటే ఇలాంటి సీనియ‌ర్ నాయ‌కులు త‌మ పార్టీలోకి రావ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని బీజేపీ భావించ‌డంతో రాజ‌గోపాల్ రెడ్డి రాక‌ను వారూ కోరుకుంటున్నారు. 

తెలంగాణాలో కేసీ ఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాలంటే టీఆర్ ఎస్ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీ వారిని వీల‌యినంత మందిని ఆక‌ట్టుకోవ‌డం, వారిని కమలం గూటికి ఆహ్వానించడం బీజేపీకి అవ‌స‌రం.  ఇపుడు తాజాగా బీజేపీకి రాజగోపాల్ రెడ్డి ద‌గ్గ‌ర‌వ‌డం పార్టీ తెలంగాణాలో టిఆర్ ఎస్‌ను దించ‌గ‌లి గేందుకు స‌త్తాను పెంచుతుందని కమలం బావిస్తోంది.   ఇదిలా ఉండ‌గా, నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయ మనీ, దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యమని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోం ది. ఈ మేరకు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. గత మూడు రోజులుగా ప్రగతి భవన్‌ నుంచే ఇందుకు సంబంధించిన వ్యూహరచన కొనసాగుతోంది. ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని టీఆర్‌ఎస్‌ నేత లు భావిస్తున్నారు. 

దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమైన మరుసటి రోజే సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య‌ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇం దులో భాగంగా  ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండల ఏర్పాటును వెను వెంటనే ప్రకటించారు. ఆ తరువాత నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ‘ఆపరేషన్‌ మునుగోడు’లో భాగంగా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఆదివారం హైదరాబాద్ లో మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవం తం చేయనున్నా రు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రధాని మోదీ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కేంద్రంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.