ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్.. అడ్డంగా బుక్కైన పైసా నికాల్ బ్యాచ్ పోలీసులు

Publish Date:Nov 27, 2021

Advertisement

అతనో ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తుంటారు. ఆయనకు ఓ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆయన దృష్టికి వచ్చాయి. కొందరు ట్రక్కు డ్రైవర్లు పోలీసుల అక్రమాలపై ఎమ్మెల్యేను కలిసి వివరించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో అక్రమ వసూళ్ల సంగతి చూడాలని ఎమ్మెల్యే డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి పూట స్టింగ్ ఆపరేషన చేశారు. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని కన్నడ్ చాలీస్‌గ్రామం ఘాట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నది ఆ ఆరోపణ. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యే మంగేష్ చహ్వాణ్‌కు తెలియడంతో ఆయన ఈ ఆరోపణల్లోని నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌ వీడియోలో.. ముందుగా ఎమ్మెల్యే కొందరు డ్రైవర్లతో మాట్లాడటం కనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేతో.. తమ దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా రూ. 500 నుంచి రూ. 2000 వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు. వీరి మాటలు విన్న ఎమ్మెల్యే ఒక ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చుని చెక్‌పోస్టు వరకూ వచ్చారు. అక్కడున్న ఒక కానిస్టేబుల్.. ఎమ్మెల్యే ఎక్కిన ట్రక్కును ఆపాడు. కిందకు దిగి రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఎమ్మెల్యే తన దగ్గర రూ. 300 మాత్రమే ఉన్నాయని వాటిని ఇస్తానన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో మరోకానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. అతను ఎమ్మల్యేను దుర్బాషలాడాడు. దీంతో ఎమ్మెల్యే వాహనం నుంచి దిగారు. అతనిని గుర్తించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. 

ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్ సమాచారం అందుకున్న ఔరంగాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లందరినీ విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగేష్ మాట్లాడుతూ తాను అక్రమాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నానని, ఇక్కడి అధికార ఫ్రభుత్వంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంతటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇప్పుడు బయటపడిందన్నారు. ఎమ్మెల్యే మంగేష్ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హాట్సాప్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
మ‌హిళ‌లు అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి అభివృద్ధి దిశ‌లోకి వెళుతున్నార‌ని భార‌త రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు
శ్రీలంక మాజీ క్రికెటర్లు సూరజ్ రందీవ్,  చింతక జయసింగ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో బస్సు డ్రైవర్‌లుగా పని చేస్తున్నారు.
మునుగోడు అన్ని రాజ‌కీయ‌పార్టీల రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగామారిన స‌మ‌యం. ఇక్క‌డ ఉప ఎన్నిక‌ల‌కు పార్టీలు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. ఈ నెల 20న లోమందితో మునుగోడు ప్ర‌జాదీవెన పేరుతో టీఆర్ ఎస్ మ‌హాస‌భ నిర్వ‌హిం చ‌నుంది.
అద్దంకి ద‌యాక‌ర్ కూడా విరుచుకుప‌డ‌టం కూడా ఎంపీ వెంక‌టరెడ్డిని మ‌రింత బాధ‌ పెట్టింది. వీరి వ్య‌వ‌ హారంపై  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాన‌ని మొండి కేశారు.
పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ  జిల్లాకు వస్తున మాధవ్‌కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు.
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ ని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ ధ్యేయమా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
బ్యాంక్ అకౌంట్ లో కొంత డ‌బ్బు తీసుకోవ‌డానికి నానా హ‌డావుడీ చేయాల్సి వ‌చ్చింది. చాలామంది భ‌య‌ప‌డ్డారు కూడా. సినిమా క్రైమ్ సీన్స్‌ని త‌ల‌పిస్తుంది. 
మ‌హిళ‌లు ఆరోగ్యంగా ఉంటేనే స‌మాజం ఆరోగ్యంగా ఉంటుంద‌న్న భావ‌న అనాదిగా ఉన్న‌ది. వారి ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య తనిస్తూ ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం సుమారు రూ.1,500 కోట్ల ఖ‌ర్చుతో పౌష్టికాహార కిట్‌ను తీసుకురానుంది.
గతంలో 12 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌కటించిన బండి ఇపుడు ఆ సంఖ్య‌ను ఏకంగా 50 కి పెంచారు.
బిలియనీర్, బిజినెస్ మ్యాగ్నెట్, స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(62) మృతి చెందారు.
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ ఆశించినంత ప‌టిష్ట వ్యూహాలేమీ వేయ‌డం లేదు.ఆయ‌న మీద అనేక ఫిర్యాదులు ఇప్ప‌టికే కాంగ్రెస్ అధి ష్టానానికి చేరాయి.
రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌గా గుర్తించారు. న్యూయార్క్ పోలీసులు దాడి చేసిన వ్యక్తి పై ఇంకా అభియోగాలు మోపలేదని, రుష్దీ పరిస్థితిని బట్టి అభియోగాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి శ్రీనివాస గౌడ్ ఆజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి  శ్రీనివాస గౌడ్ అత్యుత్సాహం ప్రదర్శించి వివాదంలో చిక్కుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.