మోడీ ఫస్ట్.. బీజేపీ నెక్ట్స్!

Publish Date:Apr 18, 2024

Advertisement

కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ... బీజేపీని మించి ఎదిగిపోయారా? పార్టీ కంటే ఆయనే ప్రధానం అనే స్థాయికి కమలం క్యాడర్ వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే విశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన  మేనిఫెస్టోను చూసిన ఎవరైనా మోడీ ఫస్ట్, బీజేపీ నెక్ట్స్ అన్నట్లుగానే కమలం పార్టీ పరిస్థితి మారిపోయిందన్న అభిప్రాయానికే వస్తారని అంటున్నారు. 

మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలకే పెద్ద పీట వేశారు.   పదేళ్ల కాలంలో మోడీ సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను  కొనసాగిస్తామనీ,  జి.ఎస్‌.టి వంటి సంస్కరణలు, ఆర్టికల్‌ 370ని రద్దు  వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాథమిక సదుపాయాల కల్పనకు మోడీ ఇచ్చిన ఇచ్చిన ప్రాధాన్యత,   సమాజంలోని ప్రతి వర్గానికి తాము అందజేసిన లబ్ధి వంటి వాటిని మోడీ ఘనతలుగా మేనిఫెస్టోలో పేర్కొన్నారు.  మూడవసారి కూడా  మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అ ధికారంలోకి రావ డం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, మరో అయిదేళ్ల పాటుబియ్యం ఉచితంగా సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు బీజేపీ మేనిఫెస్టోలో ప్రముఖంగా పేర్కొన్నారు.  

ఉమ్మడి పౌర స్మృతిని, ఒకే దేశం-ఒకే ఎన్నికలు తదితర అంశాలను అమలు చేస్తామనడమే కాకుండా, బులెట్‌ రైళ్లు,  వందే భారత్‌ రైళ్ల సంఖ్యను పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, పేదలకు మూడు కోట్ల గృహాల నిర్మాణం, పైపుతో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా, మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నట్టు   ప్రకటించారు. ప్రధానంగా హిందుత్వ అజెండానే పొందుపరిచారు.

దాదాపుగా బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గత పదేళ్లుగా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకునేందుకు చేసిన ప్రకటనలు వాగ్దానాలే అనడంలో సందేహం లేదు. అయితే దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంపన్న, పేదల మధ్య పెరిగిన అంతరం, రైతుల ఆదాయం రెట్టింపు కావడం అటుంచి, వారి కష్టాలు మరింత పెరగడం వంటి అంశాల జోలికి బీజేపీ మేనిఫెస్టో పోలేదు. ఈ మేనిఫెస్టోలో ఆ దిశగా ఎటువంటి వాగ్దానాలూ లేవనే చెప్పాలి.  ఉద్యోగాలను సృష్టిం, రైతుల ఆదాయం రెట్టింపు వంటి గత వాగ్దానాల గురించిన ప్రస్తావనే లేదు.  దీంతో బీజేపీ పార్టీగా కంటే మోడీని మరింత ఫోకస్ లోకి తీసుకురావడం మీదనే ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
వామ్మో... రోజులు మరీ దారుణంగా మారిపోతున్నాయి. ఇటీవల కర్నాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు తేల్చారు. ఈ మూడు నెలలు వైశాఖ, జ్యేష్ట, ఆషాడ మాసాలు కావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు విరామం వచ్చింది.
టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల ముందు జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు వెల‌వెల పోతున్నాయి. గ‌తంలో జ‌గ‌న్‌కు ఓటు వేసిన వారంతా ఇప్పుడు కూట‌మి మేనిఫెస్టో కే జై అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం మొత్తం ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చివేసింది.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ‘జనగళం’ పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి హామీ పద్ధతిగా వుంది. చంద్రబాబు విజన్‌ని ప్రతిఫలించేలా వుంది.
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి
కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది. ఇప్పటికే అధికార వైసీసీ నవరత్నాలు ప్లస్ అంటూ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోను పోలుస్తూ జనం చర్చించుకుంటున్నారు. జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా, నవరత్నాలుప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్ది పాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి విరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది.
గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు
అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు.
ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.