Publish Date:Jul 27, 2022
క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత అంటూ ఘనంగా చెప్పుకునే బీజేపీ అసలు రంగు ఏమిటన్నది గుజరాత్ సాక్షిగా తేటతెల్లమైపోయింది. భారత రాష్ట్రపతిగా గిరి పుత్రిక ముర్మ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్నిపురస్కరించుకుని గుజరాత్ లోని గిరిజన ప్రాబల్యం అధికంగా ఉండే చోటౌడేపూర్ లో విజయోత్సవ సభ నిర్వహించింది
బీజేపీ. భారత ప్రథమ పౌరురాలిగా గిరిపుత్రికను పీఠం ఎక్కించిన క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకునే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గుజరాత్ లోని చోటౌడ పూర్ లో కూడా బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉంది. ఆ విజయోత్సవ సభకు హాజరైన గుజరాత్ మంత్రి, బీజేపీ నాయకుడు నిమిషా సుతార్ తప్పతాగి హాజరయ్యారు. అలాగే సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రష్మాకాంత్ వాసవ కూడా హాజయర్యారు. ఆయన హాజరవ్వడం విశేషం కాదు కానీ.. తప్పతాగి హాజరు కావడమే ఇప్పడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడానికి కారణమైంది.
సభా స్థలికి వచ్చి కారు దిగడమే తూలుతూ వచ్చిన ఆయన సభా వేదికపై కూడా పరిసరాలను గమనించే స్ఫృహ లేని స్థితిలో ఉన్నారు. పక్కను మహిళా మంత్రి ఉన్నారన్న స్ఫృహ కూడా లేనంతగా మత్తులో మునిగిపోయారు. విజయోత్సవ సభ ప్రారంభమైనది మొదలు, ముగిసే వరకూ ఆయన కళ్లు తెరిచింది లేదు. వేదికపై తూగుతూ ఊగుతూనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండటంతో గుజరాత్ బీజేపీ ప్రతిష్ట మసక బారింది. దీంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు రష్మీకాంత్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి నిర్వాకం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ సర్కార్ గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తున్నామని ఘనంగా చెప్పుకోవడం కాదు.. అది నిజంగా అమలు అవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంఘటనపై విపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. బీజేపీ దంతా పేరు గొప్ప ఊరు దిబ్బ చందమే ననడానికి రష్మీకాంత్ ఉదంతమే నిదర్శనమని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-leader-came-to-murmu-success-meet-in-drunken-stage-39-140622.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.