తెలుగుదేశం... జనసేన మధ్యలో బీజేపీ.. పొత్తులు పొడిచేనా?

Publish Date:Aug 2, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పొత్తులు, ఎత్తుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా పొత్తు వ్యవహారాలన్నీ బీజేపీ సెంట్రిక్ గానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సర్వ వ్యవస్థలనూ గుప్పెట్లో పెట్టుకుని ఒక విధంగా పోలీసు పాలనను సాగిస్తున్నదని రాజకీయ వర్గాలలోనే కాదు జనబాహుల్యంలో కూడా గట్టిగా వినిపిస్తున్నది. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా తెలుగుదేశం జగన్ సర్కార్ విధానాలు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది.  

2024 ఎన్నికలలో  వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. పార్టీని, పార్టీ శ్రేణులను నిరంతరం చైతన్యవంతం చేస్తూ  జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పాదయాత్ర పేరిట జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, నేతల అరాచకత్వాలను ప్రజలలో ఎండగడుతూ యువగళం పేర పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ ను గద్దెదింపడమే లక్ష్యంగా పోరుబాటలో సాగుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వనని, అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ రాష్ట్రంలో పొత్తు పొడుపులపై చర్చకు తెరతీశారు. అది కూడా నిన్నో మొన్నో కాదు.. దాదాపు ఏడాదిన్నర కిందటే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననీ, జగన్ వ్యతిరేక శక్తులన్నిటినీ కలుపుకు పోతానని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలనుకోవడం లేదని కూడా క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో తెలుగుదేశం, జనసేనలు పొత్తుతోనే ఎన్నికలకు వెడతాయన్నది విస్పష్టంగా తేలిపోయింది. అయితే రాష్ట్రంలో ఇసుమంతైనా ఓటు బ్యాంకు లేకపోయినా.. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి నడిస్తే మంచిదని, జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమని జనసేనాని భావిస్తున్నారు.

ఇప్పటికే జనసేన, బీజేపీల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. తెలుగుదేశం కూడా బీజేపీతో ఘర్షణాత్మక వైఖరిని కోరుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో జగన్ హింసాత్మక వైఖరి, ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల నమోదు వంటి విషయాలలో కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా నిలబడి, నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అండ అవసరమన్న భావనతోనే తెలుగుదేశం బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జ ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలరాదు అని పదేపదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఇటీవల  ఢిల్లీ పర్యటనలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలిసివస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తుంటే ఒకే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసే ఎన్నికల బరిలోకి దిగుతాయన్న భావన, బీజేపీ జగన్ సర్కార్ కు అండగా నిలుస్తూ పొత్తు పొడుపునకు అవరోధాలు కలిగిస్తోందన్న భావనా కలుగుతున్నాయి.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.