బీజేపీ హైకమాండ్ బండినే శరణుజొచ్చిందా?

Publish Date:Nov 7, 2023

Advertisement

తెలంగాణ బీజేపీలో అంతర్మథనం మొదలైందా? తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష అన్న అనుమానం మొదలైందా? తెలంగాణలో బీజేపీ ఫేస్ బండి సంజయ్ మాత్రమేనని ఆలస్యంగా గుర్తించిందా? అంటే పార్టీ శ్రేణులు మాత్రం ఔననే అంటున్నాయి. పరిశీలకుల విశ్లేషణలు సైతం అదే దిశలో సాగుతున్నాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీజేపీ రాష్ట్రంలో రేసుగుర్రంలా ఉరకలెత్తింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పుంజుకుంటున్నదని ఎవరైనా చెప్పినా జనం కూడా నమ్మే పరిస్థితి లేదన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే.. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు  అప్పగించారో ఆ క్షణం నుంచీ బీజేపీ అనూహ్యంగా వెనుకబడింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన సభ మొత్తం బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది. 

ఇక అక్కడ నుంచి తెలంగాణలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్లు నాగంభోట్టు అన్నట్లుగా మారింది. అధికారమే తరువాయి నుంచి అసలు సింగిల్ డిజిట్ స్థానాలనైనా గెలుచుకుంటుందా అన్న పరిస్థితికి దిగజారింది. ఇందుకు రాష్ట్ర బీజేపీ నేతల కంటే పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

అటువంటి వేళ రాష్ట్రంలో  బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించేందుకు నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇంతకు ముందే అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా  ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అయితే మోడీ ఆ ప్రకటన చేస్తూ రాష్ట్రంలో బీజేపీలో మరిన్ని వికెట్లు పడిపోయే అవకాశం ఉందనీ విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలిపోతున్నాయి. పార్టీ క్యాడర్ అభీష్ఠానికి వ్యతిరేకంగా కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై కూడా బీజేపీలో నిరసనలు వెల్లువెత్తాయి. గతంలోనే.. అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన తెలంగాణలో పొత్తుల ప్రశక్తే లేదు..ఒంటరిగానే అధికారంలోకి వస్తామని విస్పష్టంగా ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కారు. అంతే కాకుండా గతంలోలా అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమా కాగడా పెట్టి వెతికినా పార్టీ నేతల్లో, కార్యకర్తలలో కనిపించడం లేదు.  

పార్టీకి అత్యంత విధేయుడైన బండి సంజయ్ తాజాగా తాను పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పార్టీ పరుగులెత్తిందనీ, ఇప్పుడు చతికిల పడిందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. అధిష్ఠానం కూడా బండి సంజయ్ దూకుడును గుర్తించి ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. హెలికాప్టర్ కూడా కేటాయించింది.  పార్టీలో జోష్ నింపాలంటే బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే బండి సంజయ్ కు ఈటల, అలాగే వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన నేతలతో పెద్దగా పొసగడం లేదన్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ఎన్నికల ముందు అభ్యర్థి ప్రకటన మొదటికే మోసం తెస్తుందా అన్న ఆలోచన కూడా బీజేపీ హై కమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద మోడీ సభ తరువాత బీజేపీలో ఇప్పుడు నెలకొన్న గందరగోళ పరిస్థితికి చుక్కపడుతుందేమో చూడాలి.   

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.