దళితులపై వరస దాడులు.. జగన్ పాలనలో పరాకాష్టకు పైశాచికత్వం!

Publish Date:Nov 6, 2023

Advertisement

ఏపీలో మరో అరాచక, పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత వ్యక్తిపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. ఆరుగురు వ్యక్తులు దళితుడిపై దాడి చేసి మంచినీళ్లు అడిగితే మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని శ్యామ్‌ కుమార్‌గా గుర్తించగా.. నిందితులు ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు నిందితులు దళిత వ్యక్తిని వాహనంలో ఎక్కించుకొని వెళ్లి నాలుగు గంటలపాటు ఇష్టారాజ్యంగా చితకబాదారు. అనంతరం బాధితుడు తీవ్ర గాయాలపాలవడంతో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసేందుకు తీసుకెళ్తుండగా అతను నీళ్లు కావాలని అడిగాడు. దీంతో అతన్ని వాహనం నుండి దించి కూర్చోబెట్టి నిందితులు ఆరుగురు అతని చుట్టూ తిరుగుతూ అతనిపై మూత్ర విసర్జన చేశారని అధికారులు తెలిపారు.

బాధితుడు శ్యామ్ కుమార్ పై నిందితుడు దాడి చేసే సమయంలో ఇప్పుడు మాదే అధికారం, మేమేం చేసినా చెల్లుతుందంటూ చితకబాదారు. మేము అధికారంలో ఉన్నంత కాలం మీరు మమ్మల్ని ఏం చేయలేరంటూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడినట్లు పోలీసులే తెలిపారు. అయితే  వైసీపీ ప్రభుత్వానికి ఈ నిందితులకు ఎలాంటి సంబంధం లేకపోయినా నిందితులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. స్థానిక వైసీపీ నేతలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఎవరూ అడగకుండానే  పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే  ఈ ఆరుగురు రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారేనని తెలుస్తుండగా.. నిందితులు వైసీపీ కార్యకర్తలా కదా అన్న అంశంపై మాత్రం పోలీసులు స్పందించలేదు.  ఈ సంఘటన తెరపైకి వచ్చిన తర్వాత టీడీపీ ఎస్సీ సెల్ నిరసన చేపట్టి  రోడ్లను దిగ్బంధించింది. కంచికచర్ల సమీపంలో హైవేను దిగ్బంధించి టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎంఎస్ రాజు ఆధ్వర్యంలో హైవేకు ఇరువైపులా నిరసన ధర్నా నిర్వహించారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో  ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

  అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే దళితులపై ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయన్నది చర్చకు వస్తున్నది. గతంలో కరోనా సమయంలో విశాఖ జిల్లాలో దళిత వైద్యుడు మాస్కులపై ప్రశ్నించగా.. అతన్ని పిచ్చి వాడిగా ముద్రవేసి గుండు కొట్టించి చేతులు విరిచి కట్టేసి పోలీసులతో చితకబాదించారు. అతన్ని ఉద్యోగం నుండి కూడా తొలగించడంతో మానసికంగా కృంగిపోయి అతను మరణించాడు. చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసే దళిత డ్రైవరును చంపేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీని వైసీపీ పెద్దలు సమావేశాలలో పక్కనే కూర్చోబెట్టుకొని ఫోజులిస్తున్నారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి రామకృష్ణపై అక్రమ కేసులు బనాయించి వేధించారు. అదే జిల్లాకు చెందిన వైద్యురాలు అనితారాణిని కూడా అసభ్యంగా దూషిస్తూ సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టి  వేధించారు. పోలీసులు వేధించడంతో కాకినాడ జిల్లాకు చెందిన ఆలపు గిరీష్ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఇవి కాకుండా వేధింపులు భరించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడగా  వాటిని అనుమానాస్పద కేసులుగా మూసేసినట్లు ఆరోపణలున్నాయి. ఆస్తుల ధ్వంసం, ఇళ్లపై దాడులు చేసిన సంఘటనలు, దళిత బాలికలు, యువతులు, మహిళపై అత్యాచారాలకు దిగిన ఘటనలు ఎన్నో ఉండగా.. ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ జిల్లాలో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. దీంతో అసలు వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే ఎందుకింత చులకనని దళిత సోదరులు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిజానికి వైసీపీ అధికారంలోకి రావడంలో దళితులే కీలకంగా వ్యవహరించారు. కానీ  వారిపై చిన్నచూపో.. ఏం చేసినా భరిస్తారనే నమ్మకమో.. అధికారం మాదే కనుక అడిగేవారు లేరన్న అహంభావమో..  రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు భయాందోళనలు కలిగిస్తున్న మాట వాస్తవం.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.