ఆదాయం సరే అప్పుల మాటేంటీ! జీతాలకు కటకటేంటీ హరీష్..  

Publish Date:Aug 24, 2021

Advertisement

నిజమే కావచ్చు తెలంగాణ  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగి పోతున్నది నిజమే కావచ్చును. ఆర్థిక వృద్ధి రేటులలో, తలసరి ఆదాయం, అన్నిటినీ మించి అప్పులు చేయడంలో, చేసిన అప్పులను సద్వినియోగం చేసుకోవడంలో, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో, దేశానికే కాదు, ప్రపంచానికే  తెలంగాణ ప్రభుత్వం ఆదర్శం నిలిచిన మాట నిజమే కావచ్చును.అలాగే, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి కాదు, ప్రజల నాతని నుంచి వస్తున్న మాటనే, ప్రతిపక్ష పార్టీల నాయకులు మీడియా ముఖంగా వినిపిస్తున్నారు. సర్కార్ చెవిన వేస్తున్నారు ప్రతిపక్షాలు అడిగాయనో, ఆరోపించాయనో కాకుండా, ఏది నిజం , ఏది కాదు అనే ఆత్మపరిశీలన చేసుకోవడం ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా, ఆర్థిక మంత్రి  హరీష్ రావుకు అవసరం.  

నిజానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అద్వాన్నంగానే ఉంది, నిరర్ధక అస్తులనే బిళ్ళను మెడలో వేసి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలనే ఆలోచనకు కేంద్రం వచ్చిందంటే మోడీ ప్రభుత్వం ఆర్థిక స్థితి ఎంత ‘అందం’ గా వుందో వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఇందుకు పూర్తిగా ప్రభుత్వాల విధానాలే కారణమని చెప్పడం కుదరదు.  సుమారు 18 నెలలకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి, అన్ని దేశాలతోపాటు, మన దేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీసింది. అసలే, అంతత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ, కొవిడ్ దెబ్బకు మరింతగా కుదేలైంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోనూ ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితే దేశంలో ఉంది దేశంలో ఉన్న పరిస్థితే ప్రపంచంలో ఉంది. 

అయితే, అధికార పార్టీలో వచ్చిన అంతర్గత విబేధాలు, కుటుంబ పార్టీలో వచ్చిన కుటుంబ కలహాల కారణంగా ఒకే ఒక్కఅసెంబ్లీ స్థానానికి వచ్చిన ఉప ఎన్నిక కోసం, వేల కోట్ల రూపాయలు కుమ్మరించడం, దానిని కప్పిపుచ్చుకునేందుకు, ధనిక రాష్ట్రమని జబ్బలు చరుచుకోవడం అవసరమా అన్నదే ఇక్కడ ప్రశ్న. కాదు, నిజంగానే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా, అమోఘంగా ఉందని అనుకుంటే,  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన సవాలును ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వీకరింఛి చర్చకు వస్తే హుందాగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పుకున్న గొప్పలను ఒప్పుకుంటూనే, బీజీపీ దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు. అఫ్కోర్స్, రఘునందన రావు చెప్పిందంతా సత్యమని కాదు, కానీ, ఆయన ప్రస్తావించిన  విషయాలు చాలావరకు బహిరంగ రహస్యాలే. ప్రతి రోజు పత్రికలలో పతాక శీర్షికలలో వస్తున్న వార్తలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, పన్నుల వాటాలు, పంకాలు వంటి సామాన్య ప్రజలకు అంతగా అర్థంకాని, విషయాలను పక్కన పెట్టినా, పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలకు అయినా సమాధానాలు చెప్పవలసిన అవసరం, రాష్ట్ర్ర ప్రభుత్వం మంత్రి హరీష్ పై ఉందని  అంటున్నారు. 

తెలంగాణ ధనిక రాష్ట్రమే అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు, వారం, పది రోజులు ఆలస్యంగా ఎందుకిస్తున్నారు, అలాగే, ఉద్యోగుల పీఆర్సీ అమలులో ఎందుకు జాప్యం జరిగింది?  కేజీబీవీ, మోడల్ స్కూళ్ల టీచర్లకు సంవత్సరం పైగా  జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు,  జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు, చివరకు ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలకు ఇస్తామన్న పది లక్షల నజరానా ఇవ్వక పోవడం వలన, అప్పులు చేసి పనులు చేసిన  సర్పంచ్లు సెక్యూరిటీ గార్డ్ లుగా, కూలీలుగా  ఎందుకు మారుతున్నారు.. బతకడానికి  వేరే రాష్ట్రాలకూ ఎందుకు వెళ్తున్నరు, పంచాయతీ సెక్రటరీలు, రైతులు ఎందుకు  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవే రఘునందన అడిగిన,  హరీశ్ సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు.అదే విధంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన ‘నిరుద్యోగ భృతి’ అవసరం ఏమిటని కాదు, ఎందుకు ఇవ్వలేదని  మాత్రమే రఘునందన రావు ప్రశ్నించారు. నిజానకి బీజేపీ ఎమ్మెల్యే  ప్రస్తావించిన అంశాలు, కొత్తవేమీ కాదు, పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన అంశాలనే ఆయన ప్రస్తావించారు.  

తెలంగాణలో ఆర్థిక క్రమక్షణ లోపించిందని కాగ్ చెప్పిన విషయాన్ని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ ధరలలో, రాష్ట్ర ఖజానాకు ఎంత మొత్తం చేరుతుందో  హరీష్ రావు చెప్పారు. ఆయన, చెప్పిన దాట్లో అసత్యం ఉంటే హరీష్ రావు బహిరంగ చర్చకు రావాలని లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ట, ముఖ్యమంత్రి ప్రతిష్ట దిగజారతాయని తెరాస నాయకులు కూడా లోలోన మదన పడుతున్నారు. అన్నిటినీ మించి తెలంగాణ ప్రభుత్వం , ఆర్థిక రంగంలో ఎదుర్కుంటున్న ప్రధాన ఆరోపణ, అప్పులు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారనేది కామన్ ఆరోపణ, అయితే హరీష్ రావు, తెలంగాణ ఆదాయం గురించి గొప్పగా చెప్పుకున్నారే, అప్పుల విషయం ఎందుకు చెప్పలేదు, విలేకరులు అడిగినా జవాబు ఎందుకు దాటవేశారు? అయితే, ఇటు రాష్ట్రం అయినా అటు కేంద్రమే అయినా, రాజకీయ ప్రయోజన్ల  కోసం, రాష్ర్గ, దేశ  ప్రయోజనాలను విస్మరించడం, పరస్పర నిందలతో దేశ ప్రతిష్టను దిగజార్చే స్థితికి  తాము దిగజారడం, మంచిది కాదు, గౌరవం కాదు. ముఖ్యంగా, ప్రస్తుత పరిస్తులలో అసలే కాదు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.