‘గ్రేటర్ గులాబీ’తోటలో ‘కమలం’ వికసిస్తుందా?

Publish Date:Dec 1, 2020

Advertisement

కాంగ్రెస్-టీడీపీ ఓట్లు బదిలీ అయితేనే ఫలితం

 

యువతలో వచ్చిన మార్పుతో కనిపిస్తున్న జోష్

 

ప్రచార జోరు ఫలితాలు రాబడితేనే భవిష్యత్తు

 

టీఆర్‌ఎస్‌కు ఇవి ప్రతిష్టాత్మకం

 

అధికారంలో ఉండటమే క లిసొస్తున్న అంశం

 

కిషన్‌రెడ్డి పట్టు-ప్రతిభకు అగ్నిపరీక్ష

 

అసమ్మతే కొంపముంచుతుందా?

 

ఎన్నికలకు అంతా రె‘ఢీ’

 

అధికార టీఆర్‌ఎస్- ప్రతిపక్ష బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో జీరో నుంచి ఉవ్వెత్తున పైకి లేచి, అధికారపార్టీ హడలెత్తిస్తున్న కమలం.. గ్రేటర్ లోని ‘గులాబీతోట’లో వికసిస్తుందా? అనే స్ధాయికి వెళ్లడం నిజంగా విశేషమే. అందుకు కమలదళపతి బండి సంజయ్ మంత్రాంగం-దూకుడే కారణమన్నది నిర్వివాదం. అయితే, ప్రచారంలో క నిపించిన జోరు, హడావిడి ఫలితాల్లో చూపించకపోతే, బీజేపీ కేవలం హైప్ పార్టీగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

 

ఇప్పటి పరిస్థితి ప్రకారం.. నగరంలో కమల కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా యువతలో తొలిసారి గతంలో ఎన్నడూ కనిపించనంత మార్పు, ఈ ఎన్నికల్లోనే కనిపించడం ప్రస్తావనార్హం. గత రెండు రోజుల వరకూ 20 సీట్ల వరకూ రావచ్చని అంచనా వేసిన ఆ పార్టీ వర్గాలు, ఇప్పుడు యువతలో దూకుడు పెరిగిన నేపథ్యంలో కనీసం 30-40 స్థానాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనా వ్యక్తమవుతోంది. నిజానికి యువతలో కూడా బీజేపీ పట్ల అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఈసారికి బీజేపీకి ఓటేయాలని తలిదండ్రులను సైతం, ఒత్తిళ్లు చేసే పరిస్థితి కనిపించడం ఇదే తొలిసారి.

 

దానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీ నిర్వీర్యమయిపోవడం, ఆ పార్టీ సానుభూతిపరులు-ఓటర్లు కూడా అందుకు ప్రత్యామ్నాయంగా, బీజేపీనే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వీటికి మించి అమిత్‌షా, నద్దా, స్మృతి ఇరానీ, యోగి వంటి అగ్రనేతలు ప్రచారంలోకి దిగడం, టీఆర్‌ఎస్ మాదిరిగానే నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించడం, సంఘ్ పరివారం చాపకిందనీరులా క్షేత్రస్థాయికి వెళ్లడం వంటి అంశాలు కమలం పార్టీకి కలసివచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, అగ్రనేతల రాకతోనే ఓట్లు వస్తాయనుకోవడం పోరపాటే అయినప్పటికీ.. జనంలో బీజేపీ క్రేజ్ పెరుగుతోందని భావించేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే ఆ ‘మౌత్‌టాక్’ విస్తరిస్తోంది కూడా. కాంగ్రెస్ కూడా సీరియస్‌గా రేసులో లేకపోవడం కూడా.. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అన్న భావన కలిగేందుకు అవకాశం ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధుల ఎంపిక లోపాలు లేకపోతే, ఈ ఊపు మరింత ఉధృతంగా ఉండేది.

 

బండి సంజయ్ దూకుడు-ప్రణాళిక పుణ్యాన..  జీరో నుంచి పైకి లేచిన కమల కెరటం, అవన్నీ ఫలించి ‘గులాబీ’ తోటలో వికసించకపోతే.. బీజేపీ హడావిడి తప్ప, ఫలితం లేని పార్టీ.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారానే,  తన ఉనికి కాపాడుకుంటుందన్న భావన మరింత బలపడి, అది విస్తృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో బీజేపీ నేతలపై ‘పని తక్కువ-పబ్లిసిటీ ఎక్కువ’ అన్న ముద్ర ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన హైప్‌నకు తగిన ఫలితాలు రాబట్టకపోతే, ఇక బీజేపీ ప్రాధాన్యం పోయినట్టు భావించకతప్పదు. ఏదేమైనా.. ఇప్పటి నాలుగు స్థానాల నుంచి డజన్ల స్థాయికి ఎదిగినా, అది ఆ పార్టీ భవిష్యత్తు విజయానికి ‘గ్రేటర్’ ముఖద్వారం అయినట్లే లెక్క.

 

అటు తెరాస హవాలో కూడా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రె డ్డికి ఈ ఎన్నికల ఫలితాలు అగ్నిపరీక్షనే. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలో, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేరు. కార్పొరేటర్లదీ అదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక అంతా ఆయన సూచన ప్రకార మే జరిగింది కాబట్టి, జయాపజయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది. మెజారిటీ డివిజన్లు సాధించకపోతే.. గత ఎన్నికల్లో ఆయన గెలుపు ‘గాలి’వాటంగానే భావించే ప్రమాదం లేకపోలేదు. అభ్యర్ధుల ఎంపికలో ఆయన పొరపాటు చేశారన్న అసంతృప్తి, అగ్రనేతల ఒత్తిళ్లకు లొంగిపోయారన్న ఆగ్రహం తొలి నుంచీ పార్టీలో పనిచేస్తున్న నేతల్లో లేకపోలేదు. దానితో కీలకమైన నియోజకవర్గాలు, డివిజన్లలో వారు సహాయ నిరాకరణ చేయడం, ఆందోళన కలిగించే అంశమే. ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు సాధిస్తేనే, ఆయన పునాదులు బలపడతాయి.

 

ఇక అధికార టీఆర్‌ఎస్‌కు.. గ్రేటర్ ఎన్నికలు జీవన్మరణం కాకపోయినా, అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే వచ్చే నష్టమేమీ లేదు. బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు తప్ప, నగరంలో అంతా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే. మెరుగైన ఫలితాలు రాకపోతే, వారి పని అయిపోయిందని.. ప్రజల్లో వారిపై వ్యతిరేకత మొదలయిందన్న ప్రచారానికి తెరలేస్తుంది. అభ్యర్ధుల ఎంపిక లోపాలు, కొంతమంది ఎమ్మెల్యేల నాన్ సీరియస్ వ్యవహారం, సిట్టింగ్ కార్పొరే టర్లపై అవినీతి ఆరోపణలు... వీటికి మించి, ఇటీవలి వరద సాయంలో పదివేలు అందరికీ ఇవ్వలేదన్న ఆగ్రహం వంటి అంశాలు,  తెరాసకు మైనస్ పాయింట్లుగా పరిణమించాయి.

 

అయితే, అధికారంలో ఉండటమే ఆ పార్టీకి బలం కూడా! ఎందుకంటే టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున, పనులు త్వరగా అవుతాయని, ప్రతిపక్షం మేయర్ అయితే పనులు జరగవన్న భావన, సాధారణ ప్రజల్లో ఏర్పడితే... అది టీఆర్‌ఎస్‌కే లాభం. ఈసారి సెటిలర్లు తెరాస వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ, యువత మాత్రం బీజేపీ వైపు చూస్తుండటం కొంత ఆందోళన కలిగించే అంశమే.

 

ఎన్నికలంతా కేటీఆర్ కథానాయకుడిగానే జరిగినందున, సహజంగా జయాపజయాలకు ఆయనదే  బాధ్యత. అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సనత్‌నగర్, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న తీగుళ్ల పద్మారావుకు సైతం, ఈ ఎన్నికల ఫలితాలు సవాలే. వారి నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక వారి ఇష్టప్రకారమే జరిగింది కాబట్టి, వారిని గెలిపించుకునే బాధ్యత కూడా సహజంగా వారిపైనే ఉంటుంది. రెండు నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ప్రతిపక్షాలు లేవు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కాలుపెడితే, అవి వారి రాజకీయ మనుగడ-ఉనికికే ప్రమాదం.

 

అటు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికీ ఈ ఫలితాలు సవాలే. నగరంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు. అలాంటిది ఆయన తన పార్లమెంటుపరిథిలోని వార్డులో,్ల మెజారిటీ స్థానాలు గెలిపించుకోకపోతే.. సొంత ఇలాకాలో గెలవలేని నేతగా విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయనొక్కరి గళమే గట్టిగా వినిపించింది. 

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.