బీజేపీ డబుల్ గేమ్.. వైసీపే షాడో ఫైటింగ్

Publish Date:Jul 31, 2023

Advertisement

దక్షిణాదిలో  ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు, బీజేపీ పట్టువీడని విక్రమార్కునిలా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నిజానికి, తెలంగాణ విషయం ఎలా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏమి చేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలి పోతోంది. ఇది చరిత్ర.  అయినా, ఓటమి నుంచి ఓటమికి సాగే ప్రయాణంలో కమల దళం’ కొత్త ఎత్తులు, పొత్తులతో ప్రయోగాలు  చేస్తోంది. 
ఇప్పుడు అదే, క్రమంలో నేషన్ ఫస్ట్ ... అని ప్రవచనాలు పలికే బీజీపీ ... రాష్ట్ర  ప్రయోజనాలతో  పాటుగా దేశ ప్రయోజనాలను సైతం దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున వైసీపే అరాచక, అసమర్ధ పాలనక కొనసాగింపుకు తెర వెనక కుట్రలకు తెర తీసిందనే  అనే అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి. అవును, అందుకే, తెలుగు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వైసేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ తేరా వెనక కుట్రలు   పన్నుతోందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈకుతల్లో భాగంగానే తెలుగు దేశం పార్టీని ఒంటరిని చేసేందుకు ఇటు జగన్ రెడ్డిని, అటు పవన్ కళ్యాణ్’ను కమల దళం దువ్వుతోందని అంటున్నారు.  
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి 23 సీట్లే వచ్చినా, 40 శాతం ఓట్లు తెచ్చుకుని జన పక్షంగా నిలిచింది. గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. మరో వంక,జగన్ రెడ్డి ‘ఒక్క ఓటు’ అభ్యర్ధనకు మోసపోయిన ప్రజలు, ఆయన గారి నిజ రూపాన్ని తెలుసుకుని  అతగాడిని సాగనంపేందుకు  సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి, రాజధాని అయినా లేని రాష్ట్రంగా నవ్యాన్ధ్రను మిగిల్చిన జగన్ రెడ్డికి  మరో ఛాన్స్ ఇచ్చేది లేదని ‘గడప గడప’ ముఖం మీదనే తలుపులు వేస్తున్న సమయంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీ సర్కార్’కు ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నం చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. 

ముఖ్యంగా ప్రభుత వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన కలవటం ఖాయమైన నేపధ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకం మొదలు తీసుకుంటున నిర్ణయాలు,   తాజా పాత్ర అనుమానస్పదంగా ఉందని అంటున్నారు. ఓ వంక జనసేన నేత పవన్ కళ్యాణ్’ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సంకల్పంతో ముందుకు సాగుతుంటే, అదే సమయంలో పవన్’ను దగ్గరకు తీసిన బీజేపీ, టీడీపీతో దూరంగా ఉంటోంది. అంతే కాదు, బీజేపీ  జగన్ రెడ్డికి మేలు చేసేందుకు పవన్ కళ్యాణ్’ను కూడా తమవైపుకు తిప్పుకుని ముక్కోణపు పోటీ వ్యూహ రచన చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.    

ఈనేపధ్యంలో ఇప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్ర బీజేపే నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు, మరో వంక వైసీపీ నాయకులూ ముందెన్నడూ లేని విధంగా బీజేపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా పురందేశ్వరికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. విరుదుచ్కు పడుతున్నారు. రాష్ట్రంలో నిండా ఒక శాతం ఓటు లేని బీజేపీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు.  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పురందేశ్వరికి  ఉన్న కుటుంబ సంబంధాలను తెర మీదకు తెచ్చి మంత్రులు సహా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్రంలో పోటీ, వైసీపీ, బీజేపీల మధ్యనే ఉంటుందనే ‘చిత్రా’న్ని చూపించే ప్రయత్నం వైసీపే చేస్తోంది.  పోనీ అదీ నిజం అనుకుందామంటే, అదే సమయంలోనే కేంద్రం ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తోంది.

అంతే  కాదు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శిస్తున్న కమల నాధులు, అడిగిందే తడవుగా నిబంధనలను తుంగలో తొక్కి మరీ రాష్ట్రాన్ని, మరింత అప్పుల ఊబిలోకి తీసుకుపోయే విధంగా ఆర్థిక వెసులు బాటు పేరున జగన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసులుకుంటోంది. ఒక విధంగాచూస్తే జగన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకు, రాష్ట్ర ప్రజల మెడలకు అప్పుల ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఏపీ కోరిన విధంగా రుణ సేకరణకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో   చంద్రబాబు నాయుడు  ఎంతగా అడిగినా పట్టించుకోని రెవిన్యూ లోటు నిధులు ఇప్పుడు విడుదల చేసింది, మోదీ ప్రభుత్వం. రాష్ట్రానికి నిధులు విడుదల  చేయడం స్వాగతించదగిన పరిణామమే అయినా, ఆ నిర్ణయం వెనక ఉన్న కుట్ర, కుతంత్రం ఏమిటన్నదే ఇప్పడు అసలు ప్రశ్న, అంటున్నారు. 

తాజాగా కేంద్రం జగన్ హాయంలో ఏపీలో గతం కంటే పెట్టుబడులు పెరిగాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో అసలు పెట్టబుడులు వెళ్లిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు వచ్చాయని ప్రకటించింది.

ఏపీలో జగన్ పాలనలో పేదరికం తగ్గిందని నీతి అయోగ్ నిర్ధారించింది. పేదరిక నియంత్రణకు జగన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు మేలు చేశాయని పేర్కొంది. మరో వంక మణిపుర్ హింసాకండను నిరసిస్తూ ప్రతిపక్ష కూటమి లోక్ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం, రాష్త్రాల హక్కులను హరించేందుకు ఉద్దేశించిన, ‘ఢిల్లీ ఆర్డినెన్సు’ స్థానంలో ప్రవేశ పెట్టే బిఅల్లు సహా, ఎన్నికల్ సమయంలో మోదీ ప్రభుత్వానికి కీలకంగా మారిన ఇతర వివాదాస్పద బిల్లులకు వైసీపీ, అడగక ముందే  జీ హుజూర్ అంటూ’ జై కొట్టింది. 

ఇలా ఒకరి కొకరు పరస్పరం సహకరించుకుంటున్న బీజేపీ, వైసీపీ రాష్ట్రంలో మాత్రం షాడో గిభ్ట్ చేస్తున్నారు. అయితే, ప్రజలు అమాయకులు కాదు .. ఆరు నూరైనా ..మళ్ళీ మరో మరు జగన్ రెడ్డికి అధికారం అప్పగించేంది లేదని సప్స్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.