వద్దు వద్దంటున్నా వస్తే ఇదే గతి!

Publish Date:May 25, 2023

Advertisement

వద్దు వద్దంటున్నా వస్తున్న నేతలకు చిత్తూరు జిల్లాలో రెండు గ్రామాల ప్రజలు కీలెరిగి వాత పెట్టిన చందంగా గుణపాఠం చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా.. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వచ్చి మీకు ఈ నాలుగేళ్లలో ఇంత సొమ్ము పందేరం చేశాం, అంత సొమ్ము పందేరం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ఇప్పటి వరకూ సమస్యలపై నిరసన గళం ఎత్తి ప్రశ్నించిన జనం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమాన్నే బహిష్కరిస్తున్నారు. వారు వచ్చే సమయానికి తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. ఇటువంటి అనుభవమే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికీ, ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకూ ఎదురైంది.  

రావద్దు బాబోయ్ అని జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు మా ప్రభుత్వం అంటూ  వస్తుండటంతో  జనం ఇక ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోవడమొక్కటే మార్గమని డిసైడైనట్లు ఉన్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామస్తులు బహిష్కరించారు. ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకుని తమ ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామం నుంచి బయటకు వెళ్లి పోయారు. ఇదే అనుభవం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికీ ఎదురైంది.

ప్రభుత్వం పట్ల ప్రజలలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం, అసంతృప్తికి ఈ సంఘటనలు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పూతలపట్టు మండలం పేట ఆగ్రహారానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వచ్చే సరికి అక్కడ అన్ని ఇళ్లూ తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను వాడుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా బహిష్కరిస్తారంటూ రుసరుసలాడారు. సిగ్గూ శరం రోషం ఉంటే తీసుకున్న పథకాలను వాపసు చేయండని ప్రజలకు సవాల్ విసిరారు. అంతే కాదు .. ఇక ముందు పేట అగ్రహారం వాసులకు ప్రభుత్వ పథకాలు వంద శాతం అందవని ప్రకటించారు. అయినా ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల ఇష్టాయిష్టాల మేరకు అందేవి కావనీ, అవి ప్రజల హక్కు అనీ ఎమ్మెల్యేకు తెలియదా అని పరిశీలకుల ప్రశ్నిస్తున్నారు. తమ విధానాలను వ్యతిరేకించే వారికి పథకాలు అందనీయను అనడం అహంకారమే అవుతుందంటున్నారు. సరే అదలా ఉంచితే.. ఎమ్మెల్యే వెళ్లిపోగానా స్వగృహాలకు తిరిగి వచ్చిన జనం తమ ఇళ్లను, ఎమ్మెల్యే తిరిగిన వీధులను పసుపు నీళ్లతో ప్రక్షాళన చేసుకున్నారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం  నారాయణ స్వామికీ ఎదురైంది.  డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  నియోజకవర్గ పరిధిలోని పాచిగుంట గ్రామంలో ఆయన బుధవారం ( మే24) గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆయన గ్రామానికి వచ్చే సమయానికి గ్రామస్తులు తమ ఇళ్లకు తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయారు. పాతిక గడప ఉన్న ఆ గ్రామంలో ఇద్దరు ముగ్గురు వినా ఎవ్వరూ డిప్యూటీ సీఎం వచ్చే సమయానికి లేకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుకు ప్రజలు ఈ విధంగా నిరసన తెలిపారు.  చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వైసీపీ నేతలకు ఇదే మర్యాద జరగడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏస్థాయిలో ఉందో అర్ధమౌతుంది.

అయితే ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి చర్యలు తీసుకోవలసిన అధికార పార్టీ నేతలు..   మా కార్యక్రమాలను బహిష్కరించిన మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు అందవంటూ హెచ్చరించడం.. ఇప్పటి దాకా తీసుకున్న పథకాలను వాపసు చేయండంటూ మండిపడటం విచిత్రంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తమ గడపగడపకూ కార్యక్రమాన్ని బహిష్కరించిన కుటుంబాలను ప్రభుత్వ పథకాల నుంచి తొలగించాలని వలంటీర్లకు, అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆయా కుటుంబాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతే కాదు.. ఈ నాలుగేళ్లలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఎంత సొమ్ము వారి అక్కౌంట్లలో జమ అయ్యిందో వివరాలు తీయండి అంటూ వాలంటీర్లకు ఆదేశించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.  

By
en-us Political News

  
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.