గుడివాడలో వైసీపీ గూబ గుయ్యిమంది!

Publish Date:Apr 14, 2023

Advertisement

ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటే రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ దూసుకుపోతుంటే, వరుస సమావేశాలతో చంద్రబాబు వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటనలు దాదాపు పూర్తి చేసుకున్న చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు.  

చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం తొక్కని అడ్డదారి లేదు.  చేయని కుతంత్రమూ లేదని తెలుగుదేశం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. తాజాగా మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన సభలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గుడివాడలో బాబు సమావేశాలను అడ్డుకునేందుకునేరుగా మాజీ మంత్రి నాని రంగంలోకి దిగాల్సి వచ్చింది.  

చివరకు రోడ్డుపై లారీలను అడ్డుగా ఉంచి సభలను అడ్డుకోవాలన్న ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో తెలుగుదేశం నేతలను శాపనార్ధాలు పెట్టేందుకు కూడా వైసీపీ  నేతలు  సిద్ధమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొడాలి నాని దౌర్జన్యాలపై ముందే అవగాహన ఉన్న టీడీపీ ప్రతి పరిణామానికి సిద్ధపడి కార్యక్రమాన్ని రూపొందించుకుంది.  నాని రౌడీఇజాన్ని ఇంత కాలం భరించిన గుడివాడ ప్రజలు చందరబాబు సభలకు రెట్టించిన ఉత్సాహంతో హాజరయ్యారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఓటమి చవి చూసిన తరువాత వైసీపీ నేతల దౌర్జన్యాలను మరింత పెంచారన్నది టీడీపీ చెబుతున్న మరో కోణం.  దీంతో సహజంగానే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ప్రజలు తమ సభలకు హారౌతున్నారని తెలుగుదేశం భావిస్తోంది. 

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సభలు, సమావేశాలు జరపకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన Go No1 ను న్యాయస్థానాలు అడ్డుకోవడంతో బాబు పర్యటనలలో మరింత ఊపు వచ్చింది.  బాబు సభలను అడ్డుకోవడం కోసం లారీలు, ట్రాక్టర్లు అడ్డుగాపెట్టడాన్ని గుడివాడప్రజలు గమనిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరి బద్రత ఉన్న చంద్రబాబు పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల  పరిస్థితి ఏమిటని ఆంధ్రప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గురువారం (ఏప్రిల్ 13) గుడివాడ సభలో చంద్రబాబు ప్రసంగం హైలైట్ కాగా, శుక్రవారం (ఏప్రిల్ 14) నాని ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలుఅతని స్థాయిని మరింత దిగజార్చాయని ఓటర్లు చెబుతున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.