బీహార్ లో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీజేపీ-జూడీయూ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అంద జేశారు. ఇక జేడీయూ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
కాగా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నితీష్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నితీష్ కుమార్ రాజీనామాతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చినట్లైంది. కాగా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు.
ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ జేడీయూ లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభ్యులు చెప్పారనీ, వారి నిర్ణయం మేరకే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. రాజీనామా చేసిన అనంతరం నితీష్ రాజ్ భవన్ నుంచి నేరుగా మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసానికి బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా ఆయనకు ఆర్జేడీ-జేడీయూ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. రెండు పార్టీలకు చెందిన జెండాలను పట్టుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
రబ్రీ దేవి నివాసంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. ఇలా ఉండగా మంగళవారం నాడే ( ఆగస్టు9) నితీష్ కుమార్ మరోసారి గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆర్జీడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని చెబుతున్నారు.
రాజీనామాకు ముందే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఫోన్‌లో సంభాషించారు. పొత్తు విషయాన్ని నిర్ధారించుకున్నారు. పొత్తు ఖరారైన తరువాతే నితీష్ కుమార్ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. . బీజేపీయేతర ప్రభుత్వం గనక ఏర్పాటైతే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజిత్ శర్మ సైతం తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bihar-cm-nitesh-kumar-resign-39-141585.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.